Moviesసంక్రాంతి బాల‌య్య‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ సెంటిమెంట్‌... ఆ సెంటిమెంట్‌తో డాకూ కూడా హిట్టే...!

సంక్రాంతి బాల‌య్య‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ సెంటిమెంట్‌… ఆ సెంటిమెంట్‌తో డాకూ కూడా హిట్టే…!

నందమూరి నరసింహ బాలకృష్ణకి మొదటి నుంచి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. బాలకృష్ణ సినిమా సంక్రాంతి బరిలో ఉంది అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావటం .. బాలయ్య కెరీర్ లోనే తిరుగేలేని హిట్ కావడం లేదా ఇండస్ట్రీ హిట్ కావడం ఎక్కువ సందర్భాలలో జరిగింది. సంక్రాంతి సినిమాలతో బాల‌య్య‌ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. సంక్రాంతి బరిలో నిలిచిన సమయాలలో ఎక్కువసార్లు బాలయ్య విజయాలు అందుకున్నారు.

NBK 109 : Massive 'Daku Maharaj' theatrical business - PakkaFilmy

సంక్రాతి బ‌రిలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాగా బాలయ్య సమరసింహారెడ్డి ఉంటుంది. 1999 జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఆ రోజుల్లో ఈ సినిమా 77 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత రెండేళ్లకు సంక్రాంతికి మరోసారి ఇదే బాలయ్య – బి గోపాల్ కాంబినేషన్లో నరసింహనాయుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. 2011 జనవరి 11న విడుదలైన ఈ సినిమా దక్షిణ భారతదేశ సినీ చరిత్రలోనే కాకుండా .. భారత దేశ సినీ చరిత్రలో తొలిసారి 100 కేంద్రాలలో వంద రోజులు ఆడిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది.

Jai Simha - Wikipedia

ఆ తర్వాత 2017 సంక్రాంతికి బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. 2018 సంక్రాంతికి బాలయ్య జై సింహ వచ్చి హీట్ అయింది. 2023లో సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి కూడా సంక్రాంతి సంచలనంగా హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్‌గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అయితే కచ్చితంగా డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అవ్వటం ఖాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news