Moviesఏం టైమింగ్ రా వీడిది..లాస్ట్ మినిట్ లో చరణ్ తెలివైన నిర్ణయం..ఇక...

ఏం టైమింగ్ రా వీడిది..లాస్ట్ మినిట్ లో చరణ్ తెలివైన నిర్ణయం..ఇక పుష్ప2 రికార్డులు తుక్కుతుక్కే..!

ఆవేశంతో కాదు ఆలోచనతో దెబ్బ కొట్టాలి అంటూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . అదేవిధంగా రామ్ చరణ్ “గేమ్ చేంజర్” విషయంలో పాటించాడు అంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . మనకు తెలిసిందే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ తాజాగా నటించిన సినిమా “గేమ్ చేంజర్”. మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్ . ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా చాలా కష్టపడ్డాడు. మరి ముఖ్యంగా సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయిపోయారు. అలాంటి టైంలో రామ్ చరణ్ ఫాన్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు.Pushpa 2 OTT release date update: When and where Allu Arjun starrer will  premiere onlineకాగా మరికొద్ది గంటల్లోనే “గేమ్ చేంజర్” సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . ఇప్పటికే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామ మాములుగా లేదు. భారీ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో .. పూలదండలతో.. పాలాభిషేకాలతో “గేమ్ చేంజర్” సినిమా హిట్ అవ్వాలి అంటూ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు . అయితే నిజానికి “గేమ్ చేంజర్” సినిమాపై ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఒక నెల ముందు వరకు కూడా లేవు . మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన లో రేవతి అనే మహిళ మృతి చెందడంతో సినిమాని ప్రమోట్ చేసుకోవాలన్న కూడా చాలా భయపడిపోయారు స్టార్స్ . ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా ఉన్నారు .

Game Changer (film) - Wikipedia“గేమ్ ఛేంజర్” సినిమా ప్రమోషన్స్ కోసం వెళితే అక్కడ జనాలు ఏగబడిపోతారు అని .. ఆ టైంలో జనాలకు ఏదైనా జరగరానిది జరిగితే ఆ విషయం కారణంగా లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండాలి అని.. సినిమా ప్రమోషన్స్ వద్దనుకున్నాడట రామ్ చరణ్ . అయితే లాస్ట్ మినిట్ లో చిరంజీవి ప్రోత్సాహంతోనే ముందుకు వచ్చారట . సినిమా కి పబ్లిసిటీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.. అది ఎంత పెద్ద హీరో అయినా సరే .. అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ స్పెషల్గా చిరంజీవి – చరణ్ తో మాట్లాడి గేమ్ చేంజర్ సినీ ప్రమోషన్స్ లో పాల్గొనేలా చేశారట. లాస్ట్ మినిట్ లో చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టే సినిమాను ఇంత బాగా పబ్లిసిటీ చేసుకోగలిగాడు అంటున్నారు చరణ్ అభిమానులు .Game Changer makers set a new release dateఅంతేకాదు పుష్ప2 సినిమా క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టే విధంగా మెగా ఫ్యాన్స్ ముందుకు వెళ్తున్నారు. మొదటి రోజే 1030కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరికొద్ది గంటల్లోనే “గేమ్ చేంజర్” సినిమా రివ్యూ బయటకు వచ్చేస్తుంది . సినిమాకి అంత సీన్ ఉందా ..? లేదా ..? అన్న విషయం కూడా అర్థమైపోతుంది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news