Moviesఒక్క ఫోన్ కాల్ తో తెలంగాణలో "గేమ్ చేంజ్" చేసిన పెద్దమనిషి.....

ఒక్క ఫోన్ కాల్ తో తెలంగాణలో “గేమ్ చేంజ్” చేసిన పెద్దమనిషి.. టికెట్ రేట్లు పెరగడానికి కర్త-కర్మ-క్రియ అంతా ఆయనే..!?

రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ఎంత టాప్ రేంజ్ లో ట్రెండ్ అయింది అన్న విషయం మనకు తెలిసిందే . పుష్ప2 సినిమా రిలీజ్ అవ్వడం.. సినిమా చూడడానికి సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ రావడం .. అక్కడ తొక్కిసలాట జరగడం.. రేవతి అనే మహిళ మృతి చెందడం .. దానికి కారణం అల్లు అర్జున్ చేసిన రోడ్ షో అంటూ తెలంగాణ పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు . అయితే ప్రజల ప్రాణాలు ఈ సినిమాలు కారణంగా పోతున్నాయి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇక బెనిఫిట్ షో లు వెయ్యము.. తమ గవర్నమెంట్ టికెట్ రేట్లు కూడా పెంచకూడదు అంటూ డిసైడ్ అయ్యింది అనే విధంగా అసెంబ్లీలోనే చెప్పుకొచ్చారు.Game Changer: Affordable in Telangana, Premium Pricing in Andhra Pradeshఅయితే అదే మాట ప్రకారం కట్టుబడి ఉంటాడు రేవంత్ రెడ్డి అని చాలామంది అనుకున్నారు. కాగా చాలా స్ట్రాంగ్గా కూడా ఆయన తీసుకున్న డెసిషన్ కి కమిట్ అయి ఉన్నాడు . లాస్ట్ మినిట్ లో ఏమైందో ఏమో తెలియదు కానీ రీసెంట్ గానే తెలంగాణలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు . అయితే అసెంబ్లీలో టికెట్ రేట్లు పెంచము.. సినిమాకి బెనిఫిట్ షో లకి పర్మీషన్ ఇవ్వమని చెప్పిన రేవంత్ రెడ్డి .. అంతే గట్టిగా ఆయన తీసుకున్న డెసీషన్ పై నిలబడ్డాడు. సినిమా సభ్యులందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసిన మూమెంట్లో ఆయన డెసిషన్ ఇదే ఫైనల్ అంటూ తేల్చి చెప్పేశారు. ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లిన సినీ సభ్యులు నిరాశతోనే వెనక్కి వచ్చారు. కానీ లాస్ట్ మినిట్ లో ఎందుకు రేవంత్ రెడ్డి ఆయన తీసుకున్న డెసిషన్ నుంచి వెనక్కి వచ్చాడు ..? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Game Changer Teaser : 'గేమ్ ఛేంజర్' కొత్త పోస్టర్.. స్పీకర్ పట్టిన చరణ్..  టీజర్ ఎన్నింటికి వస్తుంది? ఏ ఛానల్ లో చూడాలి? | Ram charan game changer  movie teaser time announced ...అయితే ఈ టికెట్ రేట్లు పెంచడానికి మూల కారణం రాహుల్ గాంధీ అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది.  కాంగ్రెస్ తో చిరంజీవికి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలుసు. కాగా తన కొడుకు నటించిన “గేమ్ చేంజర్” సినిమా టికెట్ రేట్ విషయంలో చిరంజీవి పెద్ద మనుషుల ద్వారా రాహుల్ గాంధీకి ఈ విషయాన్ని చేరవేసి మరి రేవంత్ రెడ్డి చేత టికెట్ రేట్లు పెంచేలా చేసుకున్నారట చిరంజీవి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది ఇది చిరంజీవి కారణంగా కాదు అని పవన్ కళ్యాణ్ కారణంగా చంద్రబాబు నాయుడు చెప్తేనే ఈ విధంగా రేవంత్ రెడ్డి చేశాడు అని మాట్లాడుకుంటున్నారు .Game Changer team drops update on second single with stylish poster of Ram  Charan | Check out new posterనిజానిజాలు ఆ దేవుడికి తెలియాలి. అయితే తెలంగాణలో బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకుండా టికెట్ రేట్లు మాత్రం పెంచి రేవంత్ రెడ్డి తాను తీసుకున్న డెసిషన్ సరైనదే అంటూ ముందుకు వెళ్తున్నాడు . చూద్దాం మరి తెలంగాణలో పెంచిన టికెట్ రేట్లు గేమ్ చేంజర్ కి ఏ విధంగా ఉపయోగపడతాయో..?? మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా బయటపడబోతోంది.. ఫస్ట్ డే ఏ విధంగా కలెక్షన్స్ సాధిస్తుందంటూ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు…!!??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news