Moviesఅలా జరిగితే సినీ చరిత్రలో "డాకు మహారాజ్" ఒక సెన్సేషన్..బాలయ్యను లడ్డులా...

అలా జరిగితే సినీ చరిత్రలో “డాకు మహారాజ్” ఒక సెన్సేషన్..బాలయ్యను లడ్డులా ఊరిస్తున్న ఆ రేర్ రికార్డ్..!

బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే . అర్ధరాత్రి నుంచి భారీ కటౌట్లతో ..ఫ్లెక్సీలతో.. దుమ్ము రేపుతూ ఉంటారు. బాలయ్య ఎంత యాక్టివ్ గా ఉంటారో బాలయ్య ఫ్యాన్స్ కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు . చలి-వర్షం-ఎండ-నిద్ర ఇలాంటివి ఏవి కేర్ చేయరు. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు అది ఎంత కష్టమైన సరే టికెట్లు కొని థియేటర్స్ లో అరుపులతో కేకలతో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కాగా నందమూరి బాలకృష్ణ తన కెరీయర్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా మూవీ “డాకు మహారాజ్”. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .Daku Maharaj: Nagavamshi seems to have high expectations of Daku Maharaj!!  - PakkaFilmy

బాలకృష్ణ కెరియర్ లో ఈ మూవీ వన్ ఆఫ్ ది హిట్ గా మిగలబోతుంది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది. గతంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “వీర సింహారెడ్డి” సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే . మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి డాకు మహారాజ్ తో అదే ఫీలింగ్ కలుగజేయబోతున్నాడు బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే బాలయ్య సినిమా అంటే కేవలం హిట్ మాత్రమే కాదు ఇండస్ట్రీ రికార్డును కూడా తిరగరాయాలి . ఇప్పుడు అలాంటి ఒక రేర్ రికార్డ్ బాలయ్య ఖాతాలో పడేలా కనిపిస్తుంది . దాని వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

బాలయ్య నటించిన “డాకు మహారాజ్” సినిమా ఇప్పటికే 70 కోట్ల థియేటర్ బిజినెస్ జరుపుకుంది . మొదటి రోజు సినిమాకి కలెక్షన్లు బాగానే వస్తాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . కాగా ఈ మూమెంట్ లోనే బాలకృష్ణ ఇప్పటివరకు నటించిన హైయెస్ట్ ఓపెనింగ్స్ ఉన్న ఐదు సినిమాలను డాకు మహారాజ్ బ్రేక్ చేస్తుంది అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు . “డాకు మహారాజ్” కి బాలయ్య అదే విధంగా సినీ సభ్యులు ఇచ్చిన హైప్స్ మామూలుగా లేవు. ఆ కారణంగానే “డాకు మహారాజు” పై ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Daku Maharaj: నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల - Latest  Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times

కాగా గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా మొదటిరోజు 25.35 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది . ఇది బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ మూవీ. బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ సినిమా మొదటి రోజు 15.39 కోట్లు షేర్ వసుళ్లు చేసింది . ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” సినిమా మొదటి రోజు 14.36 కోట్లు షేర్ చేసింది. అంతే కాదు ఎన్టీఆర్ బయోపిక్గా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రలో నటించారు . ఈ సినిమా 7.5 కోట్లు షేర్ వసూళ్లు చేసింది . అయితే బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఈ నాలుగు సినిమాలే ఓపెనింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి . మరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్”.. ఈ నాలుగు సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా..? లేదా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కచ్చితంగా “డాకు మహారాజ్” మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాలయ్య నటించిన “డాకు మహారాజ్” సినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతుందో..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news