నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు కేఎస్ రవీంద్ర ( బాబి ) డైరెక్ట్ చేస్తుండగా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య ఇప్పటికే అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్ పై అంచనాల మామూలుగా లేవు.. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు స్కై రేంజ్ ను టచ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేలా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ టాప్ సీక్రెట్ బయట పెట్టారు.
డాకు మహారాజు సినిమాలోని సెకండ్ హాఫ్ లో ఓ సీక్వెన్స్ ఉంటుందని .. ఇది బాలయ్య బ్లాక్ బస్టర్ సమరసింహారెడ్డి సినిమాలో ఎపిసోడ్ లా ఉంటుందని .. సినిమా చూస్తున్న అభిమానులు అందరూ ఒక్కసారిగా తిరిగి పాత రోజులకు వెళతారని.. దబిడి దిబిడే అని ఊరికే అనలేదు అంటూ నాగవంశీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మామూలుగానే సమరసింహారెడ్డి సినిమా అంటే పవర్ఫుల్ డైలాగులు .. బాలయ్య ఊచకోత.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు మనకు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు బాలయ్య ఊచకోత తరహా సీక్వెన్స్ డాకూ మహారాజ్‌లో ఖాయంగా ఉండబోతుందని నాగవంశం చెప్పడంతో ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా ప్రఖ్యా జైస్వాల్ – శ్రద్ధ శ్రీనాథ్ – చాందిని చౌదరి నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో బాబీడివోల్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా .. మరో ముగ్గురు విలన్లు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ – దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.