Moviesఏపీలో ఆ సిటీలో ' డాకూ మ‌హారాజ్ ' టిక్కెట్స్ సోల్ట్...

ఏపీలో ఆ సిటీలో ‘ డాకూ మ‌హారాజ్ ‘ టిక్కెట్స్ సోల్ట్ అవుట్‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే చాలు తెలుగు నాట అంచనాలు ఎలా ? ఉంటాయో చెప్పక్కర్లేదు. తెలుగు గడ్డ మీదే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ఎక్కడ ఉన్నా .. మాస్ సినిమా అభిమానించే తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ? బాలయ్య సినిమా ఎప్పుడిప్పుడు వస్తుందా ?అని చ‌కోర పక్షుల్లా.. కళ్ళు కాయలు కాచేలా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉంటారు. మామూలుగానే బాలయ్య సినిమాపై మాస్ జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాంటిది అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్‌ కేసరి లాంటి మూడు సూపర్ హిట్ సినిమాలు తర్వాత బాలయ్య నటించిన సినిమా వస్తుంది అంటే అంచనాలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు.

Daku Maharaj first Review : బాలయ్య 'డాకు మహారాజ్' మొట్టమొదటి రివ్యూ  వచ్చేసింది..సినిమాలోని హైలైట్ సన్నివేశాలు ఇవే..ఫ్యాన్స్ కి ఫీస్ట్! |  entertainment news in ...

అందులోనూ మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన కొల్లి బాబి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇక తారాస్థాయిలోనే ఉన్నాయి. ఈ నెల 12న డాకు మహారాజ్‌ థియేటర్ల దగ్గర గర్జన చేయడానికి రెడీ అయిపోయారు. బాలయ్యకు జోడిగా అఖండ ముద్దుగమ్మ ప్రగ్యా జైస్వాల్ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్ – చాందిని చౌదరి జోడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో బాబీడియోల్‌ విలన్ గా నటిస్తూ ఉండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెల్లవారుజాము 4 గంట‌ల నుంచే బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు రంగం సిద్ధమవుతోంది.

Balakrishna: 'Daku Maharaj' Promises Unprecedented Action Sequences

ఆంధ్రప్రదేశ్లో పశ్చిమగోదావరి – కృష్ణ – గుంటూరు – ప్రకాశం – సీమ జిల్లాలలో బాలయ్యకు తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే పలుచోట్ల భారీగా బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు. ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన బెనిఫిట్ షో లు అన్నింటికీ అప్పుడే టిక్కెట్లు షోల్డ్ అవుట్ అని పెట్టేశారు. దీనిని బట్టి డాకు మాహారాజ్‌ సినిమాపై ఈ నాలుగు జిల్లాల తో పాటు సీడెడ్‌ లోను క‌నీ విని.. ఎరుగని రీతిలో అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news