తెలుగు తెరపై వెండితెర, బుల్లితెర పైన ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు యాంకర్ అనితా చౌదరి. 16 ఏళ్లకే తన సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె జెమినీ, ఈటీవీ, జీ తెలుగు వంటి ఛానల్స్‌లో ఎన్నో పాపులర్ ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేశారు. ఆ రోజుల్లోనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది.
ఆ తర్వాత వెండి తెరపై కూడా గుర్తింపు తెచ్చుకోవాలని అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 1997లో నటుడు శ్రీకాంత్ హీరోగా నటించిన తాళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ ఛాన్స్ ఆమె వదులుకున్నారు. అప్పటికే ఆమె యాంకర్‌గా బిజీగా ఉండడమే కారణం. ఆ తర్వాత వెంకటేష్ రాజా సినిమాతో ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏకంగా 50కు పైగా సినిమాల్లో నటించేసింది.
కరోనా టైంలో అక్వా అనే ఓ వెబ్ సీరిస్‌తో కూడా ప్రేక్షకులను పలకరించారు. ఇక అనిత చౌదరి ఫ్యామిలీ చాలా పెద్దది. ఆమెకు ముగ్గురు అన్నయ్యలతో పాటు ఓ అక్క కూడా ఉందట. ఇంటి బాధ్యతల నేపథ్యంలో ఆమె కొంత కాలంగా ఆ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. హీరో శ్రీకాంత్‌కు అనిత చౌదరి దగ్గర బంధువు అట. శ్రీకాంత్‌కు దగ్గర బంధువు అయిన కృష్ణ చైతన్యను అనిత చౌదరి ప్రేమించి మరీ 2005లో పెళ్లి చేసుకుందట. ఈ ప్రేమ పెళ్లి శ్రీకాంత్ దగ్గరుండి మరీ చేశారట.