Moviesడాకూ మ‌హారాజ్‌లో బిగ్ స‌ర్‌ఫ్రైజ్‌... ఎన్టీఆర్ స్టైల్లో బాల‌య్య ... పూన‌కాలో...

డాకూ మ‌హారాజ్‌లో బిగ్ స‌ర్‌ఫ్రైజ్‌… ఎన్టీఆర్ స్టైల్లో బాల‌య్య … పూన‌కాలో లోడింగ్‌..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, చాందిని చౌద‌రి హీరోయిన్లుగా.. టాలీవుడ్ యువ‌ దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ డాకు మహారాజ్. బాల‌య్య మూడు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఉండ‌డంతో డాకూ మ‌హారాజ్ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక టైటిల్ టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే సినిమా మీద అంచ‌నాలు స్కై రేంజ్‌లో ఉన్నాయి.

తాజాగా వ‌చ్చిన ట్రైల‌ర్ త‌ర్వాత మాస్ జ‌నాల‌తో పాటు తెలుగు సినీ ల‌వ‌ర్స్ అయితే డాకూ మ‌హారాజ్ కోసం పెచ్చెక్కేలా వెయిట్ చేస్తున్నారు. మాస్ ఆడియెన్స్ నుంచి ట్రైల‌ర్‌కు మామూలు రెస్పాన్స్ రాలేదు. ట్రైల‌ర్ త‌ర్వాత అంచనాలు మరింత లెవెల్లోకి మారిపోయాయి. అయితే ఈ ట్రైలర్ లో బాలయ్యని బాబీ నెవర్ బిఫోర్ గా ప్రెజెంట్ చేయడం కేజ్రీగా మారింది.

బాలయ్య వింటేజ్ లుక్ చూపించడం ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేసింది. ఏదేమైనా ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాక బాలయ్య నుంచి ఒక రుద్ర తాండవంనే మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ద‌క్ష‌య‌జ్ఞం సినిమాలో శివ‌తాండ‌వం ఎలా చేశారో ఇప్పుడు ఈ సినిమాలో రుద్ర తాండ‌వం అలాగే ఉండ‌బోతోంద‌ట‌. మ‌రి డాకూగా బాల‌య్య బాక్సాఫీస్ గ‌ర్జ‌న ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news