నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. సింహా.. ఆ తర్వాత లెజెండ్.. అఖండ మూడు సూపర్ హిట్లే. ఇక అఖండ ఎంత పెద్ద హిట్లో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న అఖండ 2 – తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ నుంచి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వచ్చేసింది.
ఇక అఖండ 2 షూటింగ్ సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయడానికి బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో జరగబోయే షెడ్యూల్ ను పూర్తిగా బాలయ్యపై ప్లాన్ చేస్తారు.
ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటులను బోయపాటి ఎంపిక చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన అన్ని లొకేషన్లను బోయపాటి ఇప్పటికే ఫైనల్ చేశారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.