Moviesబాల‌య్య షూటింగ్‌లో ఎంజాయ్ చేసిన రెండు సినిమాలు ఇవే...!

బాల‌య్య షూటింగ్‌లో ఎంజాయ్ చేసిన రెండు సినిమాలు ఇవే…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నట ప్రస్థానానికి గత ఏడాదితో 50 ఏళ్ళు ముగిసాయి. బాలయ్య నటించిన తొలి సినిమా తాతమ్మ కల‌ 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే బాలయ్య సినీ స్వ‌ర్ణోత్సవాన్ని టాలీవుడ్ గత ఏడాది ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 1 న హైదరాబాదులోని ప్రముఖ హోటల్‌లో టాలీవుడ్ ప్రముఖుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బాలయ్య సినీ స్వ‌ర్ణోత్సవ వేడుక జరిగింది. ఇనేళ్ళ‌ కెరీర్‌లో బాలయ్య ఎన్నో సినిమాలలో నటించారు. బాలయ్య తొలి సినిమా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించారు.Chennakesava Reddy: ఇరవై ఏళ్ళ 'చెన్నకేశవ రెడ్డి' - NTV Teluguబాలయ్య ఎన్నో సినిమాలలో ఎంతో మంది దర్శకులతో కలిసి పని చేసినా.. ఆయన తొలి సినిమాకు తన తండ్రి దివంగత నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించటం.. బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని చెప్పాలి. ఇక బాలయ్య హీరోగా చేసిన తొలి సినిమా సాహసమే జీవితం. ఇది 1984లో రిలీజ్ అయింది. అంటే బాలయ్య సినిమాలలోకి వచ్చిన పది సంవత్సరాలకు గాని హీరోగా తొలి సినిమా చేయలేదు. బాలయ్య తన కెరీర్‌లో ఇప్పటి వరకు 109 సినిమాలలో నటించారు. తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్‌ సినిమా.. బాలయ్య కెరీర్‌లో 109వ సినిమాగా తెరకెక్కింది.Watch Paisa Vasool (Telugu) Full Movie Online | Sun NXTబోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న అఖండ 2 తాండవం.. 110 సినిమా కావటం విశేషం. బాలయ్య తన కెరీర్‌లో ఎన్ని సినిమాలలో నటించినా రెండు సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ నటించారు. అందులో ఒకటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన పైసా వసూల్. ఈ సినిమాలో పూరి.. బాలయ్యను అప్పటివరకు ఎవరు చూపించని సరికొత్త కోణంలో ప్రజెంట్ చేశారు. బాలయ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న అన్ని రోజులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశారట. అలాగే వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 2002లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు కూడా బాలయ్య ఎంజాయ్ చేశారట. మరి ముఖ్యంగా తండ్రి పాత్రలో లీనమై ఇంటికి వెళ్ళాక కూడా అదే పాత్ర గురించి ఆలోచించేవాడిని అని బాలయ్య పలు సందర్భాలలో చెప్పారు.

Latest news