నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. మామూలుగా 60 ఏళ్లు దాటిన హీరోలకు క్రేజ్ తగ్గుతుంది. అదేంటో కానీ.. 60 ఏళ్ళు దాటిన తర్వాత బాలయ్య క్రేజ్ రోజురోజుకు అమాంతం పెరుగుతూ వస్తోంది. అటు.. వెండి తెరతో పాటు, ఇటు బుల్లితెరను షేక్ చేస్తూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా నుంచి బాలయ్యకు శుక్రమహర్దశ బాగా పట్టినట్టుగా ఉంది. ఆయన ఏ సినిమా చేసిన.. ఏ కథతో సినిమా చేసిన ఎవరి డైరెక్షన్‌లో నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.తనకు కలిసి వచ్చిన బోయపాటి శ్రీను మాత్రమే కాదు.. మలినేని గోపీచంద్, అనిల్ రావిపూడి, బాబీ లాంటి డైరెక్టర్లతో బాలయ్య సినిమాలు చేస్తున్న సూపర్ డూపర్ హిట్లు వస్తున్నాయి. డాకు మహారాజ్ సినిమా.. కంటెంట్ యావరేజ్‌గా ఉన్నా.. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. ప్రస్తుతం బాలయ్య అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సంయుక్తా మీనన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎన్బికే థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఏకధాటిగా జరిగే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి.. వచ్చే దసరాకు సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య సినిమాలలో మూడు అంశాలు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఆ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా కూడా.. బాలయ్య సినిమాలలో రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలలో ఆయన నటిస్తారు. అలాగే ఆయన సినిమాలలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు కామన్‌గా కనిపిస్తారు. అలాగే బాలయ్య సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు చాలా కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. బాలయ్య సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండాల్సిందే. అలా ఈ మూడు కామన్ అంశాలు బాలయ్య సినిమాలకు తప్పనిసరి అయిపోయాయి.
బాలయ్య సినిమా అంటే ఈ 3 కామన్‌గా ఉండాల్సిందే.. గమనించారా..!
