నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే ఆయన అభిమానులకు పూనకాలు వస్తూ ఉంటాయి. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్న ఈ హీరో 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా తన దూకుడు చూపిస్తున్నారు. వరుసగా నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలుతో టాలీవుడ్‌లో ఈ తరం కుర్ర హీరోలకు కూడా భారీగా సవాలు విసురుతున్నారు. తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య తన కెరీర్‌లో సాధించిన టాప్ కలెక్షన్ల సినిమాలు ఏంటో చూద్దాం. బాలయ్య నటించిన డాకు మహారాజు సినిమా ఇప్పటికీ రూ.180 కోట్ల వసూళ్లు దాటి.. రూ.200 కోట్లవైపు పరుగులు పెడుతోంది.ఇక 2023లో సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమా రూ.85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి వరల్డ్ వైడ్గా రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు.. రూ.80 కోట్ల షేర్ రాబట్టింది. అఖండ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ రూ.50 కోట్లు. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా అదరగొట్టేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్‌లో కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు దాటిన మొదటి సినిమా ఇది కావటం విశేషం. భగవంత్ కేసరి సినిమా బడ్జెట్ రూ.75 కోట్లు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.127 కోట్లు రాబట్టింది.
ఇక బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.82 కోట్లు గ్రాస్, రూ.51 కోట్ల షేర్ రాబట్టింది. లెజెండ్ సినిమా రూ.35 కోట్లతో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రూ.41 కోట్ల షేర్ వచ్చింది. సింహా సినిమా రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూ.53 కోట్లు వసూళ్లు చేసింది. రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. జై సింహా సినిమా రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.52 కోట్లు గ్రాస్ కొల్లగొట్టింది. ఈ సినిమా రూ.31 కోట్ల షేర్ రాబట్టింది. నరసింహనాయుడు 25 ఏళ్ల క్రితమే రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఆ రోజుల్లోనే రూ.38 కోట్లు రాబట్టింది. రూ.20 కోట్లకు పైగా లాభాలు సాధించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.8 కోట్లు.
బాలయ్య కెరీరర్‌లో భారీ కలెక్షన్లు సాధించిన టాప్ – 10 సినిమాలు ఇవే..!
