Movies"డాకు మహారాజ్" లో బాలయ్య కొత్తగా టచ్ చేసిన ఐదు అంశాలు...

“డాకు మహారాజ్” లో బాలయ్య కొత్తగా టచ్ చేసిన ఐదు అంశాలు ఇవే.. ఆయన కెరియర్ లోనే సో సో స్పెషల్(వీడియో) ..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బాలయ్య నటించిన “డాకు మహారాజ్” సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్నారు జనాలు . నందమూరి హీరో బాలకృష్ణ తన సినీ కెరియర్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా అఖండతో స్టార్ట్ అయిన ఆయన 100 కోట్ల క్లబ్.. అలా అలా ముందుకు వెళ్ళిపోతూనే వస్తుంది . అఖండ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన బాలయ్య తర్వాత “వీర సిమ్హా రెడ్డి” సినిమాతో.. అదే విధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “భగవంత్ కేసరి” సినిమాతో ఆ ట్రాక్ రికార్డును అలాగే మైంటైన్ చేస్తూ వస్తున్నారు .Daku Maharaj Trailer : బాలయ్య డాకు మహారాజ్ మాస్ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..? | entertainment news in telugu | ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇన్ తెలుగుకాగా ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఆయన నటించిన “డాకు మహారాజ్” సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . సినీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా “డాకు మహారాజ్” ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ . ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య లోని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూపించడంలో డైరెక్టర్ బాబి సూపర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి . మరి ముఖ్యంగా బాలయ్య సినిమాలు అంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది . అది అందరికీ తెలుసు. కానీ అందరూ చూసే బాలయ్యను తెరపై చూపిస్తే ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నాడు ఏమో..? బాబి స్పెషల్గా ఐదు అంశాలను బాలయ్యలో చూపించడానికి బాగా ట్రై చేసినట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది .

*మరి ముఖ్యంగా బాలయ్య అంటేనే మాస్ డైలాగ్స్ ..నోటి నుంచి ఘాటు ఘాటు పదాలు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు . అయితే ఈ ట్రైలర్లో బాబీ ఎక్కడ కూడా బాలయ్య నోటి నుంచి మాస్ డైలాగ్స్ వినిపించలేదు.

*అంతేకాదు చాలామంది బాలయ్య సెంటిమెంట్ సీన్స్ లో నటించలేడు అంటూ అనుకుంటూ ఉంటారు . కానీ సెంటిమెంట్ సీన్స్ ని బాగా నటించగలడు బాలయ్య అంటూ ఆయనలోని ఒక ఎమోషనల్ బాలయ్యను బయటికి రప్పించే ప్రయత్నం చేశాడు బాబి .

*అంతే కాదు కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ లో బాలయ్య ఓన్ గా నటించడు అని డూప్స్ తోనే ఆ సీన్స్ ను కంప్లీట్ చేస్తాడు అని .. ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ వచ్చాయి . అయితే ఈ సినిమాలో మాత్రం ఏ డూప్ లేరు. డూప్ నటించలేదట. అన్ని సీన్స్ లోనూ బాలయ్య ఓన్ గా నటించాడట.Daaku Maharaj : This is the highlight episode of 'Daku Maharaj' - PakkaFilmy*మరీ ముఖ్యంగా “డాకు మహారాజ్” కి ప్లస్ బాలయ్య ఎక్స్ప్రెషన్స్. ఇప్పటివరకు మనం చూసిన అన్ని సినిమాలలో బాలయ్య ఎక్స్ప్రెషన్స్ అంతగా హైలెట్ అయ్యే విధంగా ఉండవు . కానీ “డాకు మహారాజ్” సినిమాలో మాత్రం బాలయ్య ఒక్కొక్క సీన్ లో లో పండించిన ఎక్స్ప్రెషన్స్ థియేటర్స్ కి వచ్చిన జనాల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి అంటున్నారు మూవీ మేకర్స్.

Daku Maharaj : 'డాకు మహారాజ్' లో ఆ 20 నిమిషాల సన్నివేశం కి ఫ్యాన్స్ ఏమైపోతారో..థియేటర్స్ ఏమైపోతాయో? బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్! | entertainment news in telugu ...*అంతేకాదు “డాకుమహారాజ్” లో ఉన్న మరో స్పెషల్ బాలయ్య డాన్స్ స్టెప్స్ . నరసింహా నాయుడు.. సమరసింహా రెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాల తర్వాత బాలయ్య అంత నాటీ రొమాంటిక్ స్టెప్స్ ఎక్కడ వేయలేదు. సింహా సినిమాలో “సింహ సిమ్హ” అనే పాటకు .. అఖండ సినిమాలో” జై బాలయ్య పాట”.. వీర సిమ్హా రెడ్డి లో ” మా బావ మనోభావాలు” అనే పాటకు మాత్రమే అలాంటి ఒక స్పెషల్ మార్క్ కనిపించింది. కానీ “డాకు మహారాజ్”లో మాత్రం టూ రొమాంటిక్ యాంగిల్ లో కూడా బాలయ్య చేత స్టెప్స్ వేయించాడట బాబి . ఆ కారణంగానే “డాకు మహారాజ్” సినిమాపై నందమూరి ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్య రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news