Moviesసంక్రాంతికి చెర్రీ - బాల‌య్య - వెంకీ ఈ ముగ్గురి టార్గెట్...

సంక్రాంతికి చెర్రీ – బాల‌య్య – వెంకీ ఈ ముగ్గురి టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా..!

టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతికి మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్, బాలయ్య – బాబి కాంబినేషన్లో డాకూ మహారాజ్, వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక ఈ మూడు సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ దాదాపు అన్ని ఏరియాలకు క్లోజ్ అయిపోయింది. గేమ్ ఛేంజర్ – సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలు దిల్ రాజువి కావడంతో కొన్ని ఏరియాలకు రెండు కలిసి కాంబో లెక్కన ఇచ్చేశారు. ఆంధ్ర ( సీడెడ్ కాకుండా ) మిగిలిన ఏరియాలో అన్ని కలిపి రు. 80 కోట్లకు ఇచ్చారు. ఇందులో గేమ్ ఛేంజ‌ర్ రు. 65 కోట్లు – సంక్రాంతి వస్తున్నాం రు. 15 కోట్ల లెక్కన ఇచ్చారు.ఏపీలో వైజాగ్ ఏరియాను నిర్మాత దిల్ రాజు ఓన్ గా పంపిణీ చేసుకుంటారు. ఇవే రెండు సినిమాలు సీడెడ్ ఏరియాకు రు. 27 కోట్లకు అమ్మారు. రు. 22 కోట్లు గేమ్ ఛేంజ‌ర్.. సంక్రాంతి వస్తున్నాం ఐదు కోట్లకి ఇచ్చారు. నైజాంలో ఈ రెండు సినిమాలతో పాటు బాలయ్య సినిమా మూడు కలిపి దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇక బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమాను నైజాం ఏరియాకు రు. 18 కోట్లకు దిల్ రాజుకు అమ్మారు. ఏపీ ఏరియాను ( సిడెడ్ మినహా ) రు. 40 కోట్లకు ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న ఈ మూడు సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో రు. 200 కోట్లకు పైనే బిజినెస్ చేశాయి. అంటే 200 కోట్ల షేర్ వస్తే ఈ మూడు సినిమాలు బ్రేక్ ఈవెన్ అయినట్టే అవుతుంది.డాకు మహారాజ్.. బాలయ్య మాస్ జాతర | nandamuri balakrishna daaku maharaj  teaser out now

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news