Moviesఏపీ గవర్నమెంట్ పెంచిన రేటు ప్రకారం.."డాకు మహారాజ్" మూవీ ఒక్క టిక్కెట్...

ఏపీ గవర్నమెంట్ పెంచిన రేటు ప్రకారం..”డాకు మహారాజ్” మూవీ ఒక్క టిక్కెట్ ధర ఎంతో తెలుసా..?

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ మరి కొద్ది రోజుల్లోనే రాబోతుంది . బాలయ్య నటించిన “డాకు మహారాజ్” సినిమా త్వరలోనే థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ” డాకు మహారాజ్ “సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ స్పెషల్ బాలయ్యను మనం ఈ సినిమాలో చూడబోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తూనే వచ్చారు. మరి ముఖ్యంగా టైటిల్ ని డిఫరెంట్ గా పెట్టి సినిమాని సగం హిట్ చేసేసాడు బాబి . బాబీ దర్శకత్వంలో బాలయ్య అంటే చాలామంది జనాలు నవ్వుకున్నారు .Balayya Daku Maharaj Movie: బాలయ్య కొత్త సినిమా టీజర్ రిలీజ్.. 'డాకు మహారాజ్'గా  ఆధరగొట్టేశాడుగా! – News18 తెలుగుబాలయ్య వైలెంట్ ..బాబి సైలెంట్ .. మరి వీళ్ళిద్దరి కాంబో లో సినిమా ఏంటి ..? అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు . కానీ సమయం గడిచే కొద్ది ఆ నెగిటివిటీ మొత్తం పాజిటివిటీగా మారిపోయింది . బాలయ్య లుక్స్ బాలయ్య డైలాగ్స్ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతుండే కొద్దీ “డాకు మహారాజ్” సినీ ఇండస్ట్రీలో స్పెషల్ రికార్డును క్రియేట్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ భావించారు. సంక్రాతి కానుకగా జనవరి 12వ తేదీ బాలయ్య నటించిన “డాకు మహారాజ్” సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది .కాగా రీసెంట్గా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాల టికెట్ రేటు విషయంలో బెనిఫిట్ షోలా విషయంలో సినీ ఇండస్ట్రీకి ఎంత ప్లస్ గా డెసిషన్స్ తీసుకున్నారో అందరికీ తెలిసిందే . “డాకు మహారాజ్” సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . కాగా ఏపీ గవర్నమెంట్ రేట్లు పెంచిన దాని ప్రకారం చూసుకుంటే.. బాలయ్య నటించిన “డా మహారాజ్”.. సినిమా ధరలు ఇలా ఉన్నాయి . జనవరి 12వ తేదీ సినిమా విడుదలవుతుంది . అదే రోజు ఉదయం 4:00 గంటలకు ప్రత్యేక షో వేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . బెనిఫిట్ షో ఒక్కొక్క టికెట్ ధర జిఎస్టి తో కలిపితే 500గా ఫిక్స్ చేశారు. అదేవిధంగా మల్టీప్లెక్స్ లలో 135 .. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 110 వరకు ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం . అలాగే జనవరి 25 వరకు పెరిగిన టిక్కెట్ ధరలు అమలులో ఉంటాయి అని కూడా ఉత్తర్వలు జారీ చేసింది . జిల్లా కలెక్టర్లు ..జాయింట్ కలెక్టర్లు ఇతర జిల్లా అధికారులు ఇందుకు సంబంధించిన రూల్స్ పాటించాలి అని కూడా ఏపీ ప్రభుత్వం సూచించింది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news