టైటిల్: గేమ్ ఛేంజర్
నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్‌జె. సూర్య, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్
యాక్షన్: అన్బరివ్
సినిమాటోగ్రఫీ: తిరుణావక్కరుసు
ఎడిటింగ్: సమీర్ మహ్మద్ – ఆంటోనీ రూబెన్
మ్యూజిక్: థమన్
నిర్మాత: దిల్ రాజు – శిరీష్ – జీ స్టూడియోస్
కథ : కార్తీక్ సుబ్బరాజు
దర్శకత్వం: శంకర్. ఎస్
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రన్ టైం: 165 నిమిషాలు
వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్: 250 కోట్లు
రిలీజ్ డేట్: 10, జనవరి, 2025
పరిచయం:
త్రిబుల్ దెబ్బకు గ్లోబల్ స్టార్ అయ్యిన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. కోలీవుడ్‌లో 25 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా తీసిన డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు రామ్‌చరణ్‌కు.. ఇటు శంకర్‌కు కూడా తమ కెరీర్‌లో 15వ సినిమా. అలాగే దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన 50వ సినిమా ఇది. దిల్ రాజు దాదాపు రు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కేవలం 4 పాటలకు ఏకంగా రు.75 కోట్లు ఖర్చు పెట్టారు. కని వినీ ఎరుగని అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. గేమ్ ఛేంజర్ నిజంగానే గేమ్‌ను మార్చి విన్ అయ్యిందా.. శంకర్, చరణ్, దిల్ రాజుకు సూపర్ హిట్ ఇచ్చిందో లేదో TL సమీక్షలో చూద్దాం.కథ:
అభ్యుదయం పార్టీ తరపున ముఖ్యమంత్రిగా బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) రాష్ట్రాన్ని పాలిస్తుంటాడు. వచ్చే యేడాది ఎన్నికలు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని పాలించాలని పార్టీ నేతలకు చెపుతాడు. గతంలో చేసిన తప్పులు అతడిని వెంటాడుతూ ఉంటాయి. సత్యమూర్తి పెంపుడు కొడుకులలో ఒకరైన బొబ్బిలి మోపిదేవి (ఎస్జే సూర్య) సీఎం కావాలని కసితో ఉంటాడు. ఇక తాను ప్రేమించిన అమ్మాయి కోరిక మేరకు ఐఏఎస్ అయ్యి తన లక్ష్యం నెరవేర్చుకుంటాడు రామ్ నందన్ (రామ్ చరణ్) . రామ్ నందన్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించగానే ఐఏఎస్ గా ఎలాంటి ముద్ర వేశాడు ? మంత్రి మోపిదేవికి రామ్ నందన్‌కు గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది.. ? రామ్ నందన్ తల్లి పార్వతి (అంజలి) మానసిక సమస్యలతో బాధ పడటానికి కారణమెవరు ? రామ్‌నందన్ తండ్రి అప్పన్న ( రామ్‌చరణ్) ను కుట్ర చేసి చంపిందెవరు
? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.TL విశ్లేషణ & డైరెక్షన్ :
సీనియర్ దర్శకుడు శంకర్ సినిమాలలో ఆయన మార్క్ ఉండడం లేదు. రచనలో పస ఉండడం లేదు.. వరుస పెట్టి ఆయన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అయితే ఈ సారి శంకర్ కార్తీక్ సుబ్బరాజు కథతో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కించారు. దీంతో సహజంగానే కాస్త ఆసక్తి కలిగింది. ఇక గేమ్ ఛేంజర్‌తో శంకర్ తన ప్లాపుల నుంచి తప్పుకునేందుకు గేమ్ కొంత వరకు ఛేంజ్ చేశాడు. సినిమాలో పాత శంకర్ మార్క్ సీన్లు చాలానే ఉన్నాయి. కథనం అంతా అన్ ప్రెడిక్టిబుల్ గా నడిపించిన శంకర్ సినిమాను చాలా వరకు సక్సెస్ చేశాడు. ప్లాష్ బ్యాక్‌ను బోర్ లేకుండా చాలా స్పీడ్‌గా ముందుకు నడిపించాడు. కథ మరీ కొత్తది కాకపోవడం…. రొటీన్ పొలిటికల్ కమర్షియల్ ఫార్ములా స్టైల్లో కథను నడిపించడం సినిమాకు మైనస్సే. చరణ్ – ఎస్.జె సూర్య మధ్య సీన్లు మరింత స్ట్రాంగ్‌గా రాసుకుని తెరకెక్కిస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండేది. రామ్ చరణ్ అటు రామ్‌నందన్ గా కలెక్టర్ పాత్రలో.. ఇటు అప్పన్న పాత్రలకు ప్రాణం పెట్టేశాడు. నిజంగా రంగస్థలం, త్రిబుల్ ఆర్ సినిమాలతో పాటు చరణ్‌లోని పరిణితి చెందిన పాత్రల సరసన ఈ సినిమాలో రెండు పాత్రలు చేరతాయి. చరణ్ తర్వాత ఆ రేంజ్‌లో మెప్పించింది ఎవరు ? అంటే ఖచ్చితంగా అంజలి పేరే చెప్పాలి. ఆమె నటన మెస్మరైజ్. అంజలి అప్పన్న భార్య పాత్రలో, 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో సినిమాలో కనిపించగా రెండు పాత్రల్లో ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయి.ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అందంగా చరణ్ పక్కన కనిపించే బొమ్మలా ఉండిపోయిందే తప్పా ఆమె పాత్రకు కంప్లీట్‌గా న్యాయం జరగలేదు. ఆమె పాటల వరకు పరిమితం అయిపోయింది. చాలా చోట్ల ఆమె లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకోలేదు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఖర్చుకు చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టారు. మరీ చిన్న పాత్రల కోసం కూడా పేరున్న నటులను తీసుకొని బడ్జెట్ ను అనవసరంగా పెంచారనిపించింది. సైడ్ సత్యం పాత్రలో సునీల్ కడుపుబ్బా నవ్వించారు. జయరాం, సముద్రఖని, నవీన్ చంద్ర పాత్రల పరిధి మేర నటించారు. వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకు మైనస్ అయిందే తప్ప ప్లస్ కాలేదు. ఇక రాజీవ్ కనకాల ముకుంద పాత్రకు జీవం పోశారు. టెక్నికల్‌గా చూస్తే థమన్ మ్యూజిక్, బీజీఎం తెరపై బాగున్నాయి. కొండ దేవర, రా మచ్చా మచ్చా, జరగండి సాంగ్స్ సినిమాకు హైలెట్. అప్పన్న పాత్రకు లోపం పెట్టి దర్శకుడు కథనాన్ని ఊహించని విధంగా నడిపించారు. మిగతా టెక్నికల్ విభాగాలు తమ వంతు న్యాయం చేశాయి. ఎడిటింగ్‌లో కొన్ని చోట్ల ట్రిమ్ చేయవచ్చు.. ఆర్ట్ వర్క్ పనితీరు ఊహాలకే అందని అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కేక పెట్టించాయి.
ప్లస్ పాయింట్స్ ( + ) :
– రామ్ చరణ్ అద్భుతమైన నటన, డ్యాన్స్
– థమన్ నేపథ్య సంగీతం
– అంజలి
– శ్రీకాంత్ యాక్టింగ్
– ప్లాస్ బ్యాక్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్ ( – ) :
– కథలో మరీ కొత్తదనం లేకపోవడం
– స్క్రీన్ ప్లేలో మిస్ అయిన మ్యాజిక్
– లాజిక్ లేని కొన్ని సీన్స్
– కియారా అద్వానీ
– కొన్ని రొటీన్ సీన్లుఫైనల్గా…
ఏదేమైనా గేమ్ ఛేంజర్ అంచనాలు పూర్తిగా అందుకోలేదు.. గేమ్‌లో అసలైన మజా లేదు… పాత రొటీన్ కమర్షియల్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా మిగిలిపోతుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ నిలిచే అవకాశం ఉంది. కొత్త తరహా కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు గేమ్ ఛేంజర్ నచ్చకపోవచ్చు.
గేమ్ ఛేంజర్ ఫైనల్ పంచ్ : కొంత వరకు గేమ్ సక్సెస్
గేమ్ ఛేంజర్ TL రేటింగ్: 2.75 / 5