టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు .. దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా ? అని అందరూ ఒక్కటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లాంచ్ విషయంలో దర్శకుడు రాజమౌళి పెద్దగా హంగామా చేయడం లేదు. ఈ సినిమా లాంచ్ కి మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు తక్కువ. సెంటిమెంట్ ప్రకారం మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ప్రతి సినిమాకు ముందు రాజమౌళి మీడియా సమావేశం పెట్టి విశేషాలు ప్రకటిస్తారు. బహుశా మహేష్ మీడియా సమావేశానికి హాజరయ్య అవకాశముంది. అయితే మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుంది ? అనేది క్లారిటీ లేదు.
ప్రస్తుతం మహేష్ బాబు ఫామ్ లో ఉన్నాడని కొందరు .. హైదరాబాదులోనే ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు.. సినిమా లాంచ్ విషయం పక్కన పెడితే కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి .. ఆఫ్రికన్ రచయిత విల్బర్గ్ స్మిత్ రాసిన నవల ఆధారంగా రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి తనకి కావలసిన విధంగా తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో కథ రాయించుకున్నారు. ఈ సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది. రెండు భాగాలలో సినిమా తెరకెక్కుతోంది.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిస్నీ లాంటి సంస్థలతో కలిసి వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది. డిస్నీ – సోనీ లాంటి సంస్థల భాగస్వామ్యం కూడా ఈ సినిమాలో ఉండబోతుందట. ఆ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినిమాకు మొత్తం అందుకోట్ల బడ్జెట్ అవుతుంది. మహేష్ బాబు – రాజమౌళి కలిసి 40 శాతం వాటా తీసుకోబోతున్నారని .. ఇద్దరు రెమ్యూనిరేషన్ భారీగా తగ్గించుకొని వాటా ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.