ఇంటర్ చదువుతుండగా ప్రేమలో పడింది .. 15 ఏళ్లుగా అతనితో ప్రేమలో ఉంది .. 2010 ప్రామిస్ రింగ్‌తో ప్రపోజల్ చేసింది. 2017లో సోలో గా విదేశాలకు ట్రిప్ వేశారు. 2022లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. 2024 డిసెంబర్లో ఏడడుగులు వేశారు. ఇది మహానటి కీర్తి సురేష్ ప్రేమాయణం. తన చిరకాలం మిత్రుడు ప్రేమికుడు ఆంటోనీ తటిల్ తో కీర్తి సురేష్ ఇటీవల ఏడు అడుగులు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ పెళ్లి గురించి విశేషాలు పంచుకున్నారు.
తాను 12వ తరగతి చదువుతున్నప్పుడే ఆంటోనీతో ప్రేమలో పడినట్టు తెలిపిన ఆమె 15 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నట్టు చెప్పారు. నా పెళ్లి ఇప్పటికే కలలా ఉంది.. మా వివాహం కోసం మేమిద్దరం ఎప్పటినుంచో కలలు కన్నా 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం.. అంటోని నాకంటే ఏడేళ్లు పెద్ద ఆరేళ్ల నుంచి ఖతర్‌లో వర్క్ చేస్తున్నాడు.. నా కెరియర్ కు చాలా సపోర్ట్ ఇస్తాడు.. అంటోనీ నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని చెప్పింది.
నేను మా కుటుంబంతో ఒకసారి రెస్టారెంట్ కి వెళ్ళా .. అంతకుముందే అతడితో నాకు పరిచయం ఉంది .. అక్కడికి అంటోనీ వచ్చాడు.. కను సైగచేస్తే ఆంటోనీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.. దమ్ముంటే అక్కడే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడు చెప్పాను.. 2017 నుంచి మా బంధం మరింత బలపడింది అని.. కీర్తి చెప్పింది. అయితే పెళ్లి ఫిక్స్ అయ్యేవరకు మా ప్రేమను ప్రైవేటుగానే ఉంచాలని నిర్ణయించుకున్నాం అని కీర్తి తెలిపింది.
ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్టు నా సన్నిహితులకు ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసు. సమంత – విజయ్ – అట్లీ – ప్రియా – ప్రియదర్శన్ – ఐశ్వర్య లక్ష్మి ఇలా కొద్దిమందికి మాత్రమే మేము ప్రేమించుకున్న విషయం తెలుసు అని కీర్తి చెప్పింది. ఇన్నేళ్ల ప్రేమలో తాము ఒకసారి ట్రిప్ వేశామని చెప్పారు.