మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వ్యక్తిగతంగా నూటికి నూరు శాతం మార్కులు వేస్తారు.. అతడి గురించి తెలిసిన వారు ఎవరైనా..! మెగాస్టార్‌కు తగ్గ తనయుడు వ్యక్తిత్వంలో చిరంజీవికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటారు. మరి ముఖ్యంగా నిర్మాతలు.. దర్శకులు అంటే చాలా గౌరవంగా వ్యవహరిస్తారని చెబుతుంటారు. టాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న మరో విషయం కూడా పైన చెప్పుకున్న విషయాలని మరోసారి నొక్కి వక్కాణిస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది. చాలా భారీ సినిమా.. పైగా మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కాల్షీట్లు ఇచ్చాడు రామ్ చరణ్. అలాంటి సినిమాకు చరణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుని ఉంటారు ? వంద కోట్లు ఉంటుందా ? లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా ?లాంటి చర్చలు ఉన్నాయి.
రామ్ చరణ్ కు ఒక అలవాటు ఉంది.. సినిమా మొత్తం పూర్తయి.. రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడే రెమ్యునరేషన్ తీసుకుంటారు. దీనికి తోడు గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాణం చాలా ఆలస్యం కావటం.. వివిధ కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడటం.. ఈ కారణాలతో నిర్మాణం పెట్టుబడి పై వడ్డీలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ముందు అనుకున్నా రెమ్యూనరేషన్‌ను చరణ బాగా తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. చరణ్ మాత్రమే కాదు దర్శకుడు శంకర్ కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి ఈ సినిమా చేసినట్టు తెలుస్తోంది.చరణ్ 65 కోట్లు – శంకర్ 35 కోట్లు మాత్రమే తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇదంతా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా రేంజ్‌కు.. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ రేంజ్‌కు ఇది కాస్త తక్కువ రమ్యునరేషన్ అని చెప్పాలి ఏది ఏమైనా నిర్మాత దిల్ రాజుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి రీజనబుల్ రేట్లకు సినిమా అమ్మే క్రమంలోనే చరణ్ – శంకర్ ఇద్దరు తమ రెమ్యూనరేషన్లు భారీగా తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.