Moviesమెగాస్టార్ - చంద్ర‌బాబును గుర్తు చేసిన చ‌ర‌ణ్‌.. వాళ్ల రుణం తీర్చుకున్నాడే..!

మెగాస్టార్ – చంద్ర‌బాబును గుర్తు చేసిన చ‌ర‌ణ్‌.. వాళ్ల రుణం తీర్చుకున్నాడే..!

టాలీవుడ్ గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేజర్ సినిమా ఈరోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీనియర్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్య‌మైన పాత్ర‌లు చేశారు. చరణ్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీతో పాటు … సీనియర్ నటీమ‌ణి అంజలి హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె. సూర్య‌ ఈ సినిమాలో విలన్ గా నటించారు.. తమన్ స్వరాలు అందించారు.Chiranjeevi to voice 'Brahmastra Part I: Shiva' trailer - IBTimes Indiaటాలీవుడ్ సీనియర్ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ తెరకెక్కింది. దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్నాం.. ఈ సినిమాను దిల్ రాజు 300 నుంచి 350 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు. ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చినం గేమ్ ఛేంజర్ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా డీసెంట్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్‌గా కలెక్టర్ పాత్ర‌తో పాటు అప్పన్న పాత్రలో అదరగొట్టేశారు. రెండు పాత్రలు వేటికవే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.Heavy Demand For CBN's Appointmentఇదిలా ఉంటే ఈ పాత్రలు చిరంజీవిని చంద్రబాబును గుర్తు చేశాయి అన్న చర్చలు సినిమా చూసినవారి మధ్య నడుస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొన్ని కారణాల వల్ల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే సినిమాలో ఒక రాజకీయ పార్టీ పేరుతో ప్రజా అని ఉండడంతో పాటు చరణ్ ఓ పొలిటికల్ సీన్‌ లో సైకిల్ పై కనిపించారు. అలా చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలుగుదేశం అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును గుర్తు చేశారు. కూటమి గెలుపు నేపథ్యంలో జనసేన తరఫున చరణ్ ఈ విధంగా రుణం తీర్చుకున్నారు అని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news