Moviesమ‌హేష్‌బాబు - రాజ‌మౌళి ప్రాజెక్ట్ నుంచి ప్రియాంక చోప్రా అవుట్‌...!

మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి ప్రాజెక్ట్ నుంచి ప్రియాంక చోప్రా అవుట్‌…!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ భారీ ప్రాజెక్ట్ లలో దర్శకుడు రాజమౌళి – టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెర‌కెక్కే మ‌హేష్‌బాబు 29వ సినిమా ఉంది. దాదాపు రెండున్న‌ర దశాబ్దాలుగా వీరి క‌ల‌యిక‌లో సినిమా కోసం యావ‌త్ తెలుగు సినీ ప్రేమికులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగుతుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.RRR: YS Jaganతో SS Rajamouli సమావేశం - Telugu Oneindiaఎట్ట‌కేల‌కు రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత‌.. అందులోనూ సింహాద్రి త‌ర్వాత ఇన్నేళ్ల‌కు రాజ‌మౌళి – మహేష్‌బాబు కాంబినేష‌న్‌లో సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ రెండు మెగా ఫోర్సెస్ క‌ల‌యిక‌తో వ‌స్తోన్న ఈ సినిమా గురించి ప్ర‌తి చిన్న అప్‌డేట్ కూడా మామూలుగా వైర‌ల్ కావ‌డం లేదు. ఈ సినిమా పై కేవ‌లం దేశ వ్యాప్తంగా కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగానే అంచ‌నాలు ఉన్నాయి.Priyanka Chopra: ఆ అనుభూతి ఎప్పుడూ ప్రత్యేకమే.. ప్రియాంక చోప్రా  ఇంట్రెస్టింగ్ కామెంట్స్అయితే ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన వార్త‌ల‌లో ఒక‌టి పూర్తిగా రూమ‌ర్ అని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మహేష్ బాబు సరసన ప్రముఖ బాలీవుడ్ నటి ఇపుడు హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా హీరోయిన్ అన్న‌ట్టు రూమ‌ర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వ‌చ్చేసింది. ప్రియాంక‌ ఈ సినిమాలో లేనట్టే అని తెలుస్తుంది. మ‌రి ప్రియాంక ప్లేస్‌లో మ‌హేష్ బాబు ప‌క్క‌న ఎవ‌రు హీరోయిన్గా ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకుంటారో ? చూడాలి.

Latest news