నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ టాలీవుడ్ సీనియర్ హీరోలలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు .. వయసు పెరుగుతున్న కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు .. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మరో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది .. ఈ సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు బాబి డైరెక్షన్లో వచ్చిన బాలయ్య మూవీ డాకు మహారాజ్ .. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. మొదటి రోజు నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను రాబడుతుంది .. తాజాగా ఏడు రోజులకు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది అనేది ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం.బాలకృష్ణ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు .. బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్ని కూడా ఆయన తన సినిమాలతో మెప్పిస్తాడు .. ఇప్పుడు బాలయ్య సినిమాలకు భారీగా క్రేజ్ ఉంది .. గతంలో సంక్రాంతికి రిలీజ్ అయిన బాలయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది .. ఇప్పుడు దాకు మహారాజ్ కూడా అంతకుమించి రికార్డులను క్రియేట్ చేస్తుంది .. మౌత్ టాక్ తో సంబంధం లేకుండానే కలెక్షన్ లో సునామీ సృష్టిస్తుంది .. మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లో సునామీ సృష్టించిన ఈ సినిమా తొలి రోజు 56 కోట్లు రాబట్టింది .. ఆ తర్వాత రోజు నుంచి ఓపెనింగ్స్ తగ్గకుండా కలెక్షన్స్ను రాబడుతూ వస్తుంది .. ఇలా నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది .. ఇక ఏడు రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది అనేది ఇక్కడ చూద్దాం.
బాలయ్య డాకు మహారాజ్ ఏడు రోజులు కలెక్షన్స్ విషయానికి వస్తే .. బాలయ్య కెరియర్ లోని అత్యంత భారీ ఓపెనింగ్ రాబట్టిన సినిమా కూడా ఇదే .. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి .. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్లు రాబట్టింది, రెండోరోజు 18 కోట్ల గ్రాస్, మూడో రోజు కూడా 18 కోట్ల గ్రాస్, ఇక నాలుగో రోజు 13 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది .. ఇలా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది .. ఇక తర్వాత ఐదు రోజులకు 125 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిందని తెలుస్తుంది .. ఆరో రోజు కూడా తగకుండా 129 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.. ఇక ఏడో రోజు కూడా అంతకుమించి ఎక్కడా తగ్గకుండా 140 కోట్ల వరకు కలెక్షన్లు తెచ్చుకుంది .. అయితే దీనిపై డాకు మహారాజ్ టీం నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది .. అయితే ఇదే జోష్లో సినిమా రన్ అయితే మాత్రం మరో మూడు రోజుల్లో 200 కోట్లు క్లబ్ లో చేరటం మాత్రం ఫిక్స్ ..
బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత .. డాకు మహారాజ్ ఏడు రోజుల కలెక్షన్స్..!
