Moviesగేమ్ ఛేంజ‌ర్ టీం నిర్ల‌క్ష్యం.. తెలుగు సెన్సార్ బోర్డు చుర‌క‌లు..?

గేమ్ ఛేంజ‌ర్ టీం నిర్ల‌క్ష్యం.. తెలుగు సెన్సార్ బోర్డు చుర‌క‌లు..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ చేంజర్. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల‌ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి మూడు సంవత్సరాలవుతుంది. మూడేళ్ల నుంచి ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఒక్కటే ఉత్కంఠ అటు మెగా అభిమానులతో పాటు ఇటు ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో ఉంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ రాంచరణ్ త్రిబుల్ ఆర్ లాంటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. త్రిబుల్ ఆర్ తో రామ్ చరణ్ రేంజ్ మామూలుగా లేదు. ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ అయిపోయాడు.

మరి ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తి చేసుకుంది. గేమ్ ఛేంజ‌ర్ మొత్తం 165 నిమిషాల నిడివితో రాబోతున్నట్టుగా దీంతో ఖరారు అయ్యింది. అయితే ఈ సెన్సార్ లో ఒక విషయంలో మాత్రం బోర్డు వారు యూనిట్ ని చురక అంటించారట‌. ఇటీవ‌ల కాలంలో మన తెలుగు సినిమాలకి తెలుగు పదాలతో పేర్లు తక్కువ కావడమే కాకుండా తెలుగు అక్షరాల్లో ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేస్తున్నారు.

Game Changer (2025) - IMDb

చాలా సినిమా ల‌కు సినిమా స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్స్ లో కూడా తెలుగు పదాలు ఇవ్వడం మానేశారు. ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా ఈ టైటిల్ కార్డు ని తెలుగులో కూడా పెట్టాలని సూచించారు. దీంతో తెలుగు వెర్షన్ రిలీజ్ లో కూడా థియేట్రికల్ గా ఇంగ్లీష్ టైటిల్ తోనే ప్లాన్ చేసిన గేమ్ ఛేంజ‌ర్ మేక‌ర్స్ నిర్ల‌క్ష్యానాకి సెన్సార్ వారి నుంచి చిన్న‌పాటి చుర‌క‌లు అయితే ప‌డ్డాయ‌నే చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news