మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టేజ్ సినిమా విశ్వంభర. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తూ ఉండగా చిరంజీవి ఎప్పుడు మూడో దశాబ్దాల క్రితం నటించిన భారీ బ్లాక్ బస్టర్ జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సోషియో ఫాంటసీ సినిమా తర్వాత మరోసారి విశ్వంభర అదే జానర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది.
దీంతో ఈ సినిమా యూనిట్ విశ్వంభర ను సంక్రాంతి రిలీజ్ చేయకుండా వాయిదా వేశారు. అభిమానులకు అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇస్తున్నామని అందుకే సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసేమని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు న్యూ ఇయర్ కూడా రావడంతో మిగిలిన సినిమాల హడావుడి మొదలైంది.. ఏదో ఒక అప్డేట్ తో అభిమానులను ఖుషి చేస్తున్నాయి, కానీ విశ్వంభర మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు.
దీంతో మెగా అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. కొత్త సంవత్సర సందర్భంగా లేదంటే సంక్రాంతి సందర్భంగా ఆయన ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని వారు కోరుతున్నారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి సంక్రాంతి కైనా విశ్వంభర నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా ? విశ్వంభరా మౌనం పెడతాడా అనేది చూడాలి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.