సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే హీరోస్ హీరోయిన్స్ కొన్ని కొన్ని సందర్భాలలో ఇష్టం లేకపోయినా సరే మనసుకు నచ్చిన సినిమాలను వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది . అలా వదులుకున్న సినిమాలు వేరే హీరో కానీ హీరోయిన్ కానీ చేసి సూపర్ సక్సెస్ అందుకుంటే చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు . అయ్యయ్యో ఈ సినిమా నేను చేసి ఉంటే బాగుండేదే అని ప్రతి ఒక్క హీరో – హీరోయిన్ లైఫ్ లో అనుకున్న మూమెంట్స్ చాలానే ఉంటాయి కానీ బాలయ్య మాత్రం అలా ఏ సినిమా విషయంలోనూ అనుకోడు. మనకు రాసిపెట్టలేదు ఏమో ఈ కథ మన వద్దకు రాలేదు అంతే.. అంటూ సైలెంట్ అయిపోతూ ఉంటారు . అలాంటి ఒక మైండ్ సెట్ కలవాడు నందమూరి బాలయ్య . బాలయ్య డిఫరెంట్ అని చాలా మంది ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా నందమూరి బాలయ్య నటించిన “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కెరియర్ లో మరో 100 కోట్ల సినిమా ఇది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే మూమెంట్లో బాలయ్య తన కెరీర్ లో వదులుకున్న టాప్ ఫైవ్ సూపర్ డూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ ట్రెండ్ అవుతున్నాయి . ఆ సినిమాలు ఏంటి ..? అసలు ఆ సినిమాలను ఎందుకు బాలయ్య వదులుకున్నాడు..? అనే విషయం ఇక్కడ ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..!సింహాద్రి: జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమా ఇది . రాజమౌళి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు . అయితే మొదటిగా రాజమౌళి సినిమాను బాలయ్యతో తెరకెక్కించాలి అని అనుకున్నాడట ..ఆశపడ్డారట . ఆ సమయానికి బాలయ్య కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడం బాలయ్య “పలనాటి బ్రహ్మనాయుడు” అనే సినిమాను ఒప్పుకొని ఆ సినిమాకి కమిట్ అయిపోవడంతో ఈ సినిమా బాలయ్య చేతుల్లో నుంచి ఎన్టీఆర్ ఖాతాలోకి పడిపోయింది . అయితే బాలయ్య నటించిన సినిమా “పలనాటి బ్రహ్మనాయుడు” ఫ్లాప్ అయింది ఎన్టీఆర్ నటించిన సినిమా “సింహాద్రి” సూపర్ డూపర్ హిట్ అయింది.చంటి: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంటి’ సినిమా ను తెలుగులో బాలయ్యతో చేయాలి అంటూ పరచూరి బ్రదర్స్ చాలా ఇష్టపడ్డారట. ఎంతో ఆశగా వెయిట్ చేశారట . అయితే బాలయ్యకు ఆ కథ నచ్చిన ఎక్కడో సినిమా తేడా కొడుతుందే ..అలాంటి ఒక క్యారెక్టర్ లో నటిస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా ..?అన్న కారణంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసుకున్నారట . అయితే పైకి మాత్రం కాల్ షీట్స్ లేవు అన్న రీజన్ ఎక్కువగా వినిపించింది . ఆ తర్వాత ఈ సినిమా వెంకటేష్ చేసి ఎంత పెద్ద హిట్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే .జానకి రాముడు: నాగార్జున – విజయశాంతి కాంబినేషన్లో తెరకెక్కిన వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ కథ కూడా ముందు బాలయ్య వద్దకే వచ్చిందట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేద్దామని బాలయ్య కూడా నిర్ణయించుకున్నారట . అయితే కోడి రామకృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల ఇది రాఘవేంద్రరావు గారి చేతికి వెళ్లింది. ఇక ఆ టైంలో బాలయ్య సినిమాపై ఇంట్రెస్ట్ లేక కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు అంటూనే తప్పుకున్నాడట . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం అందరికీ తెలుసు .సింహరాశి: రాజశేఖర్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు . ఈ సినిమా మొదటగా బాలయ్య చేతికే వచ్చిందట. అయితే రీమిక్ సినిమాలు చేయడం ఇష్టం లేని బాలయ్య దాన్ని తిరస్కరించడంతోపాటు కాల్ షీట్స్ కూడా రెడీగా లేవు అంటూ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట .క్రాక్: రవితేజ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమాను గోపీచంద్ మల్లినేని డైరెక్ట్ చేశారు . నిజానికి ఈ సినిమాను బాలయ్య కోసమే రాసుకున్నారట గోపీచంద్ మల్లినేని. అయితే అంత పెద్ద స్టార్ ని ఒక సాధారణమైన యాక్షన్ సినిమాలో చూపిస్తే ఫ్యాన్స్ ఆక్సెప్ట్ చేయరు అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపించాయి. ఆ ఉద్దేశంతో బాలయ్య ఈ మూవీ రిజెక్ట్ చేసారట . కానీ పైకి మాత్రం కాల్ షీట్స్ సరిపోడం లేదు అన్న రీజన్ బయటకు వచ్చింది .
అలా బాలయ్య తన కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాలను ఒకే రీజన్ తో మిస్ చేసుకున్నాడు. అయితే బాలయ్య ఈ సినిమాలను మిస్ చేసుకున్న ఆ తర్వాత నటించిన సినిమాలను మాత్రం సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాడు .అయ్యయ్యో మంచి సినిమాలను మిస్ అయిపోయాను అంటూ బాలయ్య ఎప్పుడు బాధపడలేదట . ఎందుకంటే ఒకటి మిస్ అయితే మరొకటి అందుకు డబల్ రేంజ్ లోనే మన వద్దకు వస్తుంది అని బాలయ్య మొదటి నుంచి నమ్మే వ్యక్తి. మరికొద్ది రోజుల్లోనే బాలయ్య నటించిన “డాకు మహారాజ్” సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా రిజల్ట్ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!