Moviesతార‌క్ ఎన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు రిజెక్ట్ చేశాడో తెలుసా...!

తార‌క్ ఎన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు రిజెక్ట్ చేశాడో తెలుసా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారం అవుతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన టెంపర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ విజయపర్వం ప్రారంభమైంది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, త్రిబుల్ ఆర్ గతేడాది చివర్లో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దేవర అయితే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలకు మించి సూపర్ డూపర్ హిట్ అయింది.Bommarillu 15 Years: 'బొమ్మరిల్లు' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు..  తెరవెనక నిజాలు..ప్రస్తుతం ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాతో పాటు.. దేవర 2 అలాగే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన కెరీర్‌లో కొన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేశారు. అందులో సిద్ధార్థ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లు సినిమా ఉంది. ఈ కథను మొదట భాస్కర్ ఎన్టీఆర్‌కు వినిపించగా.. అందులో యాక్షన్ సన్నివేశాలు భారీ డైలాగులు లేకపోవడంతో.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.Prime Video: Bhadraఆ టైంలో ఎన్టీఆర్ వరుస పెట్టి మాస్ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఇక రవితేజ హీరోగా, మీరా జాస్మిన్‌ హీరోయిన్గా.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన తొలి సినిమా భద్ర. ఈ సినిమా కథ కూడా ముందుగా ఎన్టీఆర్ వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాత కావటం విశేషం.

Latest news