Moviesబాల‌య్య లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ' డాకూ మ‌హారాజ్ ' ఓటీటీ డేట్...

బాల‌య్య లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ డాకూ మ‌హారాజ్ ‘ ఓటీటీ డేట్ వ‌చ్చేసింది.. !

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 180 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కేఎస్‌. ర‌వీంద్ర ( కొల్లు బాబి ) డైరెక్ట్ చేయ‌గా కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డాకూ మ‌హారాజ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య నటనకు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.Daku Maharaj Movie: ఈరోజు హైదరాబాద్ లో 'డాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

బాల‌య్య కెరీర్‌లో ఇది వ‌రుస‌గా నాలుగో విజ‌యం. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ? అని అంద‌రూ ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న వేళ ఈ సినిమా ఓటీటీ డేట్ పై తాజా అప్‌డేట్ వ‌చ్చేసింది. ‘డాకు మహారాజ్’ సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.Daku Maharaj' Pre-Release Event Cancelledఇక ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి.

Latest news