Moviesసినీ ఇండస్ట్రీలోనే నెవర్-ఎవర్-అన్ ఎక్స్పెక్టెడ్ కాంబో ఇది.. రష్మిక తో ఆ...

సినీ ఇండస్ట్రీలోనే నెవర్-ఎవర్-అన్ ఎక్స్పెక్టెడ్ కాంబో ఇది.. రష్మిక తో ఆ ఇద్దరు హీరోలు మల్టీ స్టారర్ మూవీ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ బాగా నడుస్తుంది. మల్టీ స్టారర్ సినిమాలను చూసే జనాలు ఎక్కువైపోయారు ..అదేవిధంగా మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ లు కూడా ఎక్కువైపోయారు . ఒక్క స్టార్ హీరో పెట్టి ఒక సినిమాను తెరకెక్కించే బదులు ఒకే సినిమాలో ముగ్గురు నలుగురు స్టార్స్ ని పెట్టి సినిమాకి భారీ హైప్ తీసుకోరావాలని చూస్తున్నారు డైరెక్టర్స్ . ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు వచ్చాయి .

త్వరలోనే తెరపైకి వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి . తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ కాంబో సెట్ అయినట్లు సమాచారం అందుతుంది . మలయాళ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో రష్మిక మందన్నా.. జతకట్ట బోతుందట . ఈ సినిమాలో మరొక హీరో కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగశౌర్య ..ఈ సినిమాలో నటిస్తున్నారట.

ప్రముఖ నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయట . రవి అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారట . ఇది ఫుల్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతుందన్న సినిమా అంటూ తెలుస్తుంది . దుల్కర్ సల్మాన్ – నాగశౌర్య హీరోగా రష్మిక హీరోయిన్ గా ఈ సినిమాలో చాలా ఢిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news