Moviesవిక్రమ్ కంటే ముందు తెలుగులో అపరిచితుడు సినిమాను మిస్ చేసుకుంది ఎవరో...

విక్రమ్ కంటే ముందు తెలుగులో అపరిచితుడు సినిమాను మిస్ చేసుకుంది ఎవరో తెలుసా..? దరిద్రానికే దరిద్రం వెంటాడిందే..!!

అపరిచితుడు.. శంకర్ విజువల్ వండర్. అప్పటివరకు కేవలం రొమాన్స్ ..ఫైట్.. సెంటిమెంట్ సినిమాలను మాత్రమే తెరకెక్కించే డైరెక్టర్స్ ఉన్న ఇండస్ట్రీలో అన్ని ఎమోషన్స్ కలిపి ఒకే సినిమాలో చూపించగలను అంటూ ప్రూవ్ చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. ఈయన దర్శకత్వంలో విక్రమ్ హీరోగా సదా హీరోయిన్గా తెరకెక్కిన సినిమా అపరిచితుడు . ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..?

ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో.. ఎన్ని సంచలనాలను సృష్టించిందో..ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కన్ను ఆర్పకుండా చూసే జనాలు ఉన్నారు . మరీ ముఖ్యంగా అటు పిల్లలని ఇటు యువతని అదేవిధంగా పెద్దలని కూదా ఆకట్టుకుంది. రెమో క్యారెక్టర్ లో నాటీ బాయ్స్.. రాము క్యారెక్టర్ లో డీసెంట్ బాయ్స్ .. అపరిచితుడు అంటూ లంచం తీసుకునే వాళ్ల గురించి బాగానే చూపించాడు శంకర్.

అయితే ఈ సినిమాకి హారిష్ శంకర్ మ్యూజిక్ కూడా హైలెట్ గా మారింది . ఈ సినిమా పాటలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ . నిజానికి ఈ సినిమాని తెలుగులో నాగార్జునతో తెరకెక్కించాలనుకున్నాడట శంకర్ . కానీ నాగార్జున ఈ కథ నాకు సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేశాడట . ఆ తర్వాత పలువురు తెలుగు హీరోస్ తో ఈ కథకు ఇంకా హైట్ తీసుకురావాలని చూసాడట . కానీ ఎవరు ఈ కథను ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఫైనల్లీ విక్రమ్ ఖాతాలో వేసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news