ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అక్కినేని అఖిల్ అంటే నాగార్జునకి ఎంత ఇష్టమనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాగార్జున మొదటి నుంచి నాగచైతన్య విషయంలోనూ అఖిల్ విషయంలోనూ చాలా చాలా కేర్‌ఫుల్ గా ఉంటాడు . చాలా చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉంటాడు . ఒకపక్క తండ్రి ప్రేమను పంచుతూనే మరొక పక్క పెద్దరికంగా మాటలు చెబుతూ ఉంటారు .
కానీ కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులు ఎంత ట్రై చేసినా పిల్లలు లైఫ్‌లో సెటిల్ కాలేరు .. అది వాళ్ళ తలరాత.. దానికి తల్లితండ్రులు ఏమి చేయలేరుగా .. అయితే అఖిల్ – నాగచైతన్య ఇప్పటివరకు లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోయారు అన్న బాధ నాగార్జున లోనే ఉంది . రీసెంట్గా నాగార్జున అఖిల్ కి సంబంధించిన ఒక చైల్డ్ హుడ్ ఇన్సిడెంట్ వైరల్ గా మారింది. మనందరికీ తెలిసిందే అఖిల్ సిసింద్రీ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు . ఈ సినిమా అందరికీ ఫేవరెట్.
చాలా చాలా క్యూట్ గా ముద్దుగా ఉంటాడు అఖిల్ . ఈ సినిమాలో నటించిన తర్వాత ఆయన ఓ పెద్ద హీరో అయిపోతాడు అని అంతా భావించారు. అఖిల్ కు ఈ సినిమా షూట్ లో గాయమైందట. ఓ రోజు సినిమా షూటింగ్ కు అఖిల్ కేర్ టేకర్ తీసుకొచ్చారట . నాగార్జున అమల ఏదో పనిమీద బిజీగా ఉండడంతో ఆరోజు మొత్తం షూటింగ్లో అఖిల్ ను కేర్ టేకర్ చూసుకోవాల్సి వచ్చిందట . ఈ క్రమంలోనే టీపాయ్ పట్టుకొని లేస్తూ ఉన్నప్పుడు అఖిల్‌కి తల దగ్గర ఒక చిన్న దెబ్బ తగిలిందట. చాలా చిన్న దెబ్బ గీతలాంటి దెబ్బ ..రక్తం కూడా రాలేదు .
కానీ ఈ విషయం తెలుసుకున్న నాగార్జున – అమల హుటాహుటిన షూటింగ్ స్ప్త్ కు వచ్చేసారట . ఇదే మూమెంట్లో డైరెక్టర్ అక్కడ ఉండే వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చారట . నాగార్జున మిమ్మల్ని కొట్టిన కొడతాడు జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చాడట. నాగార్జున అంతే కోపంగా కార్ దిగి షూటింగ్ స్పాట్ కి వచ్చి అరిచేసాడట . అదే మూమెంట్లో పక్కనే ఉన్న నాగార్జున ఫ్రెండ్ సతీష్ ..నాగార్జున పై అరిచారట ..చిన్నపిల్లలు అన్నాక దెబ్బలు తగలవా? దెబ్బలు తగలకుండానే పిల్లల్ని పెంచుతావా..? అంటూ కొంచెం కోప్పడడంతో నాగార్జున ఆలోచించి కూల్ అయ్యాడట.. లేకపోతే ఆరోజు నాగార్జున ఏం చేసేవాడోఅని తలుచుకుంటుంటేనే భయమేస్తుంది అంటూ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు..!!