Moviesటాలీవుడ్ క్రేజీ హీరోని లైన్లో పెట్టేసిన సంయుక్త మీనన్.. ఈ పిల్ల...

టాలీవుడ్ క్రేజీ హీరోని లైన్లో పెట్టేసిన సంయుక్త మీనన్.. ఈ పిల్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..!

సంయుక్త మీనన్.. పేరుకు మలయాళీ బ్యూటీని కానీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . నిజానికి సంయుక్త కటౌట్ చూడగానే ఈమె ఏం హీరోయిన్..? హీరోలకు అక్కలా ఉంటుంది అని చాలామంది భయపడ్డారు. భీమ్లా నాయక్ అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ . పవన్ కళ్యాణ్ పుణ్యమాంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది .

అమ్మడి అదృష్టమో లేకపోతే టాలెంట్ నో తెలియదు కానీ అమ్మడు నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు సాయి ధరంతేజ్తో విరుపాక్ష సినిమాలో నటించి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది సంయుక్త . ఈ సినిమాలో ఆమె పండించిన డ్యూయల్ షేడ్స్ మరి ఏ హీరోయిన్ కూడా పండించలేదు అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేసారు. ఆమె తెలుగులో ఆఖరిగా నటించిన సినిమా డెవిల్ . కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాలో మంచి పర్ఫామెన్స్ చూపించింది సంయుక్త.

ఆ తర్వాత తెలుగు సినిమాలకు అసలు సైన్ చేయలేదు . ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . అయితే వాటికి చెక్ పెడుతూ సంయుక్త మీనన్ తెలుగు క్రేజీ హీరోతో సినిమాకు సైన్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది . సామజ వరగమన ఫేమ్ రాం అబ్బరాజు తో శర్వానంద్ ఒక కొత్త సినిమాకి కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే . 2024 వేసవి కాలంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సంయుక్తా – శర్వానంద్ కు జోడిగా నటించబోతుందట . అంతేకాదు సాక్షి వైద్య కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతుందట . ఫస్ట్ హీరోయిన్గా సంయుక్తా నటించబోతుంది అంటూ సమాచారం అందుతుంది. శర్వానంద్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే మంచి కంటెంట్ ఉంటాయి . మరి ముఖ్యంగా ఫ్యామిలీ హీరో అంటూ పేరు ఉంది .

అలాంటి హీరో సరసన అమ్మడు నటిస్తుంది అంటే మరోసారి ట్రెడిషనల్ బ్యూటీ గా ఇండస్ట్రీను మడత పెట్టేయడం సంయుక్త మీనన్ పక్క అంటున్నారు అభిమానులు . అమ్మడు లైన్ అప్ చూస్తుంటే జనాలకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి . ఇప్పటివరకు సంయుక్త చూస్ చేసుకున్న అందరి హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ పైన కూడా హిట్ టాక్ సంపాదించుకునే సత్తా ఉన్న హీరో మూవీస్ చేసుకోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news