Moviesకేవలం 12 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన రాజమౌళి .. టోటల్...

కేవలం 12 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన రాజమౌళి .. టోటల్ ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..?

రాజమౌళి.. ఈ పేరు చెప్పగానే గూస్ బంప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన వన అండ్ ఓన్లీ లెజెండ్ డైరెక్టర్. ఇండస్ట్రీలో అంతకుముందు కూడా డైరెక్టర్స్ ఉండేవారు . కానీ సినిమాను డైరెక్ట్ చేసామా..? సినిమా హిట్ అయితే హ్యాపీ ..ఫట్టయితే ఏడుపు .. నెక్స్ట్ సినిమా విషయంలో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకునేవారు . కానీ రాజమౌళి మాత్రం సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసాడు . సినిమా ఫ్లాప్ అవ్వకుండా డైరెక్ట్ చేయడంలో నెంబర్ వన్ డైరెక్టర్ ఈయననే చెప్పాలి .

జక్కన్నగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే రాజమౌళికి సంబంధించిన కొన్ని వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి టోటల్ ఆస్తి విలువలకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . తిప్పి తిప్పి కొడితే దాదాపు పాతికేళ్ల కెరియర్లో రాజమౌళి చేసింది 12 చిత్రాలు . ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాదు ..అన్ని సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ..

పెట్టిన దానికి అన్ని డబల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిన మూవీస్ కావడం గమనార్హం.. కెరియర్ స్టార్టింగ్ లో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రాజమౌళి ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట . అంతేకాదు మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా విషయంలో ఏకంగా షేర్ కూడా డిమాండ్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాజమౌళి టోటల్ ఆస్తి ఖరీదు 350 కోట్లుగా తెలుస్తుంది .

ఇది కేవలం ఆయన తన స్వయంకృషితో ఇండస్ట్రీలోకి వచ్చి సంపాదించిన ఆస్తి మాత్రమే అంటూ ప్రచారం జరుగుతుంది . నిజానికి రాజమౌళి దుబారా ఖర్చులు చేయరు . వచ్చింది వచ్చినట్లు సేవింగ్ పెట్టేస్తారు . అంతే కాదు పలుచోట్ల ఆస్తులు కూడా కూడ పెట్టారు . హైదరాబాద్ శివారులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఖరీదైన కారులతో పాటు రాజమౌళి కొన్ని బిజినెస్ల్లో కూడా పెట్టుబడులు పెట్టారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ రేంజ్ లో ఆస్తులు కూడా పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు.. అది జక్కన్నకు మాత్రమే సాధ్యమైంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news