Moviesనందమూరి అభిమానులకు మండిస్తున్న బాబీ.. బాలయ్య సినిమాకి ఇంత చెత్త టైటిలా..?

నందమూరి అభిమానులకు మండిస్తున్న బాబీ.. బాలయ్య సినిమాకి ఇంత చెత్త టైటిలా..?

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న మూవీ. వరుసగా క్రేజీ క్రేజీ హిట్లతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎన్బికె 109 అనే హ్యాష్ ట్యాగ్ తో మొదలైన ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించబోతుంది ..అనుష్క నటించబోతుంది అంటూ తెగ ప్రచారాలు జరిగాయి .

అయితే ఆఖరికి ఈ సినిమాలో హీరోయిన్గా పాయల్ రాహ్ పుత్ ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాలో కూడా నందమూరి బాలకృష్ణ డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వైరల్ గా మారింది . బాబి తన సినిమా టైటిల్స్ విషయంలో కేర్ఫుల్ గా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే బాబి ఈసారి తీసుకున్న నిర్ణయం నందమూరి అభిమానులకు మండిపోయేలా చేస్తుంది. ఈ సినిమాకి సింపుల్గా మాస్ గా ఉండే వీరమాస్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారట .ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు సమాచారం అందుతుంది . బాలయ్య లాంటి హీరోకు ఇంత సింపుల్ టైటిలా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు నందమూరి అభిమానులు . అంతేకాదు ఈ సినిమా విషయంలో బాబి ఏమాత్రం అటు ఇటు నిర్ణయాలు తీసుకున్న కెరియర్ కొలాప్స్ అవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్.. దుల్కర్ సల్మాన్ ..చాందిని చౌదరి వంటి వాళ్ళు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news