Moviesనాగచైతన్య కు కొత్త తలనొప్పులు స్టార్ట్.. మళ్ళీ నమ్మించి ముంచేస్తున్నారుగా..!

నాగచైతన్య కు కొత్త తలనొప్పులు స్టార్ట్.. మళ్ళీ నమ్మించి ముంచేస్తున్నారుగా..!

పాపం నాగచైతన్య .. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది . సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ ని ఎంత తగ్గించుకోవాలి అనుకున్న సరే ఎందుకో ఆయనపై ఏదో ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇవన్నీ కాదు ఎలాగైనా సరే సినిమా హిట్ కొట్టాలి అంటూ చాలా భీష్మించుకుని కూర్చున్నాడు నాగచైతన్య. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా “తండేల్”. ఈ సినిమా మొత్తం సముద్రం నేపథ్యంలోనే తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుంది . రెండవ హీరోయిన్గా కీర్తి సురేష్ నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకోవాలి అనుకున్న నాగచైతన్యకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి అంటూ చిత్ర పరిశ్రమలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .నాగచైతన్యకు అనుకొని అడ్డంకులు రాబోతున్నాయట. ఈ సినిమా మొత్తం సముద్రమే మెయిన్ ధీమ్ గా తెరకెక్కుతుంది. ప్రయాణం అంతా కూడా అలల మధ్యలోనే .. సాఫీగా సాగిపోతున్న చైతన్య సినిమాలో కొత్త అడ్డంకులు రాబోతున్నాయట .

తాజాగా అరేబియన్ కడలి అనే వెబ్ సిరీస్ ప్రకటించారు . ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. రెండు గ్రామాల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లి దేశపు బార్డర్ క్రాస్ చేస్తే ..ఆ తర్వాత ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేశారు ..అన్నది మిగిలిన కధ. ఇంచుమించు తండేల్ సినిమా కథ కూడా అలాగే ఉంటుంది. తండేల్ దసరాకు రిలీజ్ కాబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అయితే ఈలోపే క్రిష్ సిరీస్ ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో నాగచైతన్యకు కొత్త తిప్పులు తప్పేలా లేవు అంటున్నారు సినీ విశ్లేషకులు . ఒకవేళ క్రిష్ సిరీస్ మొత్తం కూడా తండేల్ లాగే ఉంటే ..తండేల్ థియేటర్లు రిలీజ్ అయ్యాక నాగచైతన్య అక్కినేని ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా ఎవరూ చూడరు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం డైరెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news