Moviesఅస్సలు ఊహించని హీరోతో ఆఫర్ అందుకున్న రాధే శ్యామ్ డైరెక్టర్.. ఒక్కే...

అస్సలు ఊహించని హీరోతో ఆఫర్ అందుకున్న రాధే శ్యామ్ డైరెక్టర్.. ఒక్కే దెబ్బకి రెండు పిట్టలు అంటే ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . రాధే శ్యామ్ సినిమా డైరెక్టర్ గోపీచంద్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . రాధాకృష్ణ తెరకెక్కించిన సినిమా రాధే శ్యామ్.. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశాడు డైరెక్టర్. కానీ అలా జరగలేదు ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో ఫ్లాప్ టాక్ దక్కించుకుంది . ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా డైరెక్టర్ పై హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరిగింది . వాటిని పెద్దగా పట్టించుకోని డైరెక్టర్ రాధాకృష్ణ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఈసారి ప్రభాస్ ఫ్రెండ్ అయినా గోపీచంద్ ని డైరెక్ట్ చేయబోతున్నాడట . ఫుల్ ఫ్లాప్స్ లో ఉన్న గోపీచంద్ కి అసలు హిట్టు లేని రాధాకృష్ణకి ఈ సినిమా ఓ అగ్నిపరీక్ష అంటున్నారు అభిమానులు . ఈ సినిమా హిట్ అయితే హిట్ అయినట్లు.. ఒకవేళ ఫ్లాప్ అయితే గోపీచంద్ కెరియర్ రాధాకృష్ణ కెరియర్ ఇక చిక్కుల్లో పడినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్ సంస్థ నిర్మించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . చూద్దాం రాధాకృష్ణ మ్యాజిక్ ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందేమో ..? హిట్టు కొడతాడు లేక ఫట్ అంటూ ఇండస్ట్రీకి దూరం అవుతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news