Moviesరాజమౌళి సినిమాలో కంటే ముందే ఆ మూవీలో కనిపించబోతున్న మహేష్ బాబు.....

రాజమౌళి సినిమాలో కంటే ముందే ఆ మూవీలో కనిపించబోతున్న మహేష్ బాబు.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఇది..!!

అవును .. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ అడ్వెంచర్స్ ఫిలిం లో నటించబోతున్నాడు . దీనికోసం భారీ భారీ స్కెచ్ లు కూడా వేస్తున్నారు . భారీ బడ్జెట్ ని కేటాయించి ఇండియన్ ఫిలిం హిస్టరీ కి మరో ఆస్కార్ అవార్డు ఈ సినిమా ద్వారా తీసుకురావాలని ట్రై చేస్తున్నారు .

అయితే ఈ సినిమా ఇప్పుడు అప్పుడే సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. ఒక డైరెక్టర్ సినిమాతో కమిట్ అయితే మరి వేరే ఏ హీరోతో మరి వేరే ఏ డైరెక్టర్ తో సినిమా చేయకూడదు. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ అనే విషయం అందరికీ తెలిసిందే . కానీ మహేష్ బాబు పెద్ద రిస్కే చేస్తున్నాడు . మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కంటే ముందే మరొక సినిమాలో కనిపించబోతున్నాడట .

ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర . కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాకు మహేష్ బాబు మాట సహాయం చేస్తున్నాడట . ఈ సినిమాలో కొన్ని సీన్స్ కు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట . అదే విధంగా లాస్ట్ లో సినిమా అయిపోయిన తర్వాత మనకి మహేష్ బాబు ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చారు అన్నది కూడా కొన్ని కొన్ని షాట్స్ చూపించబోతున్నారట. అక్టోబర్ 10ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది . అసలు అక్టోబర్ 10 వరకు రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అన్న నమ్మకాలు కూడా లేవు. అలా గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా కంటే ముందే మనం మహేష్ బాబును దేవర సినిమాలో చూడొచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news