Moviesఎన్టీఆర్ తో చేయాల్సిన మూవీను చరణ్ తో చేస్తున్న బుచ్చిబాబు సన.....

ఎన్టీఆర్ తో చేయాల్సిన మూవీను చరణ్ తో చేస్తున్న బుచ్చిబాబు సన.. సినిమా చేతులు మారేలా చేసింది ఆ పెద్దమనిషేనా..?

ఈ విషయం మనందరికీ తెలిసిందే . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన బుచ్చిబాబు సన .. తన రెండవ సినిమాని ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నాడు . ఈ సినిమాకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా వివరించారు. ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమాను ఓకే కూడా చేసేసాడు . కానీ లాస్ట్ మూమెంట్లో ఈ సినిమా చేతులు మారిపోయింది.

ఎన్టీఆర్ తో చేయాలి అని బుచ్చిబాబు రాసుకున్న కథను ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్నాడు . దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను బుచ్చిబాబు సన చరణ్ తో చేయడానికి కారణం.. టాప్ డైరెక్టర్ అన్న విషయం ఆలస్యంగా బయటపడింది .

07

ఆయన మరెవరో కాదు సుకుమార్ . సుకుమార్ శిష్యుడే ఈ బుచ్చిబాబు సన . తన సినిమాల విషయంలో సుకుమార్ తో ఎప్పుడు చర్చిస్తూనే ఉంటాడు. అలా చర్చించిన మూమెంట్లోనే ఎన్టీఆర్ కన్నా ఈ స్క్రిప్ట్ చరణ్ కి బాగా సూట్ అవుతుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ చరణ్ కి వివరించు.. అంటూ సజెస్ట్ చేశారట . అనుకున్న విధంగానే చరణ్ కి స్క్రిప్ట్ వివరించారు .. కొన్ని మార్పులు ..చేర్పులు చేసి మెగా హీరోతో ఫిక్స్ అయిపోయాడు . అలా సుకుమార్ సలహాతో ఎన్టీఆర్ తో రాసుకున్న కథను చరణ్ తో చేస్తున్నాడు బుచ్చిబాబు సన . చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news