Movies"అలాంటి ఒకరోజు వస్తుంది అని తెలిస్తేనే భయమేస్తుంది".. కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్...

“అలాంటి ఒకరోజు వస్తుంది అని తెలిస్తేనే భయమేస్తుంది”.. కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్..!

మృణాల్ ఠాకూర్.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. పక్కాగా చెప్పాలి అంటే సీతారామం సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు ఈ బ్యూటీ పేరు జనాలకు పెద్దగా తెలియదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈమె పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో పొడవైన హీరోయిన్గా సెక్సీ ఫిగర్ గా బాగా ట్యాగ్ చేయించుకుంది.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కూడా నటించింది . ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ కి హాజరవుతూ తన సినిమా విషయాలనే కాకుండా పర్సనల్ విషయాలను కూడా ఓపెన్ గా చెప్పుకొస్తుంది. తాను కూడా అందరూ అమ్మాయిలు లాగే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలి అని చాలా సార్లు అనుకున్నాను అని .. 25 వయసులోనే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో చక్కగా భర్తతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను అని ..

కానీ తనకు సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ ఇటువైపుగా వచ్చాను అని చెప్పుకు వచ్చింది . అంతేకాదు మనిషి పుట్టుక పుట్టాక మరణించడం ఖచ్చితంగా జరగాల్సిందే.. అయితే నేను ఒకరోజు మరణిస్తాను అని తెలిసి మాత్రం నాకు భయమేస్తుంది ..నేను చనిపోయాక నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తేనే కంగారు పుడుతుంది అంటూ ఎమోషనల్ అయింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news