Movies"విశ్వంభర" మరో హీరో కూడా.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.. వశిష్ట...

“విశ్వంభర” మరో హీరో కూడా.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.. వశిష్ట ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా “విశ్వంభర”. సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్ లేక అల్లాడిపోతున్న చిరంజీవి .. ఈ సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు . అంతేకాదు ఈ సినిమా ద్వారా ఆయన మరో సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ అయినట్లు రీసెంట్ గానే చిత్తబృందం అఫీషియల్ గా ప్రకటించింది .

నిజానికి ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా వేరే బ్యూటీస్ ని అనుకున్నారట . వాళ్ళు రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ త్రిషకు వచ్చింది. ఫైనల్లీ 18 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో సెలెక్ట్ అయింది . అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో మరో మెగా హీరో కూడా కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన మరెవరో కాదు వరుణ్ తేజ్. రీసెంట్ గానే లావణ్య త్రిపాథి ను పెళ్లి చేసుకున్న ఆయన ..ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ.. మరో పక్క సినిమాలతో బిజీ అవుతున్నాడు.

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ పాత్ర కోసం వశిష్ట .. వరుణ్ తేజ్ ని చూస్ చేసుకున్నారట . చిరంజీవితో ఎప్పుడెప్పుడు సినిమాలో నటించాలి అంటూ వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ ఇదే మహా ప్రసాదం అనుకొని ఆఫర్ను ఓకే చేసేసారట . ఇదే న్యూస్ ను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఒక్కవేళ్ల ఈ కాంబో నిజంగా సెట్ అయితే కెవ్వు కేక అనే చెప్పాలి. చూద్దాం తెరపై వరుణ్ – చిరంజీవిలా కాంబో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news