Moviesప్రభాస్ అభిమానులను మండిస్తున్న విశ్వక్ సేన్ కామెంట్స్.. సలార్ ను కరివేపాకులా...

ప్రభాస్ అభిమానులను మండిస్తున్న విశ్వక్ సేన్ కామెంట్స్.. సలార్ ను కరివేపాకులా తీసేశాడు ఏంటి(వీడియో)..!

ఈ మధ్యకాలంలో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి పాపులారిటీ దక్కించుకోవడం చాలా కామన్ గా చూస్తున్నాం. సామాన్య జనాలు కూడా ఎవరో ఒక స్టార్ సెలబ్రిటీపై లేని పోనీ కామెంట్స్ చేయడం తద్వారా పాపులారిటీ సంపాదించుకోవడం మనం బాగా గమనిస్తున్నాం. అయితే తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ మస్ కా దాస్ విశ్వక్ సేన్ కొన్ని కొన్ని సార్లు చేస్తున్న కామెంట్స్ ఆయనపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నాయి అంటున్నారు జనాలు .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విశ్వక్ సేన్ ఎలాంటి కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుక్కున్నారో మనకు తెలిసిందే . రీసెంట్గా విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా “గామి”. విద్యాధర కాగితా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ నిర్మిస్తున్నారు . ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్స్ అభిమానులను సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నాయి. ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మార్చి 8న ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా రావడానికి సిద్ధంగా ఉంది .

ఇదే క్రమంలో ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. రీసెంట్గా మీడియాతో ముచ్చటించారు . ఈ క్రమంలోనే సలార్ మూవీ గురించి విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన టీం ..సినిమాకి మంచి పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంది . ఇదే క్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..” ఈ మధ్య సైలెంట్ గా ఉంటేనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటాడు”.. దీనికి రిపోర్టర్ వచ్చి..” సలార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా బ్రో..?” అని ప్రశ్నిస్తాడు..” నాలుగేళ్ల క్రిందట ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామంటూ విశ్వక్సేన్ నవూతూ ఘాటుగా బదిలిస్తాడు”. ప్రజెంట్ ఇది ట్రోలర్స్ కి కీ పాయింట్ గా చిక్కేసింది . దీనికి కొంచెం మాస్ మసాలా యాడ్ చేస్తూ వీడియోస్ వైరల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news