MoviesTL రివ్యూ: గేమ్ ఆన్ ... సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌... ఇంత...

TL రివ్యూ: గేమ్ ఆన్ … సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌… ఇంత కొత్త‌గానా…

టైటిల్‌: గేమ్ ఆన్‌
నటీనటులు: గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌, ఆదిత్య మీనన్, వాసంతి, కిరిటీ తదితరులు.
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : అర‌వింద్ విశ్వనాథ‌న్‌ ;
ఎడిటర్ : వంశీ అట్లూరి ;
మ్యూజిక్‌ : అభిషేక్ ఏ.ఆర్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్ ;
ఆర్ట్ : విఠ‌ల్‌ ;
స్క్రిప్ట్ సూప‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ;
యాక్షన్ కొరియోగ్రఫీః రామ‌కృష్ణ
పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ;
నిర్మాత : రవి కస్తూరి ;
కథ, ద‌ర్శకత్వం :  దయానంద్.
రిలీజ్ డేట్‌: 02–02–2024

క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన సినిమా గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ సినిమాకు దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించ‌డంతో పాటు ట్రైల‌ర్లు, టీజ‌ర్ల‌తో సినిమాపై రిలీజ్‌కు ముందే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
లూజర్ గా ఉన్న వ్యక్తి విన్నర్ గా ఎలా మారాడనేది ఈ సినిమా మెయిన్ లైన్‌. గౌత‌మ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు ( గీతానంద్‌) ఓ గేమింగ్ కంపెనీలో ప‌నిచేస్తూ ఉంటాడు. అదే సంస్థలో ప‌నిచేసే మోక్ష (వాసంతి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఉద్యోగంలో టార్గెట్ స‌రిగా పూర్తి చేయ‌లేక‌పోవ‌డంతో అత‌డి ఉద్యోగం పోతుంది. అదే టైంలో మోక్ష సిద్ధుకు బ్రేక‌ప్ చెప్పేసి త‌న ఫ్రెండ్ రాహుల్ ( కిరీటి)తో వెళ్లిపోతుంది. ఇటు ఉద్యోగం పోవ‌డం, అటు ప్రేమించిన అమ్మాయి బ్రేక‌ప్ చెప్ప‌డంతో చ‌నిపోవాల‌నుకుంటాడు. అదే టైంలో అత‌డికి ఓ ఫోన్ కాల్ వ‌స్తుంది. నీ ముందు ఉన్న ఈగ‌ను చంపేస్తే ల‌క్ష రూపాయ‌లు నీ అక్కౌంట్‌లో క్రెడిట్ అవుతాయంటారు. వెంట‌నే సిద్ధు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న ఆలోచ‌న విర‌మించుకుని ఇంటికి వెళ‌తాడు. వెంట‌నే మ‌రో ఫోన్ కాల్‌..ఇదో సైక‌లాజిక‌ల్ గేమ్ షో చిన్న‌పిల్లాడిని ఏడిపిస్తే రు. 3 ల‌క్ష‌లు ఇస్తామంటారు. అలా వ‌రుస‌గా చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ డ‌బ్బులు పంపుతుండ‌డంతో సిద్ధు జీవితం మ‌రోలా మారుతుంది. ఈ క్ర‌మంలోనే అత‌డి జీవితంలోకి తార ( నేహా సోలంకి) ఎంట్రీ ఇస్తుంది.

ఈ టైంలో సిద్ధుకు ఓ వ్య‌క్తిని చంపాల‌ని ఫోన్ కాల్ వ‌స్తుంది. సిద్ధు ఆ టాస్క్ పూర్తి చేయ‌లేన‌ని చేతులు ఎత్తేస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది ? సిద్ధుకు వ‌రుస‌గా ఈ టాస్క్‌లు ఇస్తోందెవ‌రు ? సైకాల‌జిస్ట్ మ‌ద‌న్‌మోహ‌న్ ( ఆదిత్య‌మీన‌న్‌)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి ? సిద్ధు తాత సూర్య‌నారాయ‌ణ ( శుభ‌లేఖ సుధాక‌ర్‌) ఎలా చ‌నిపోయాడు ? సిద్ధు గ‌తం ఏంటి ? సిద్ధు లైఫ్ లోకి వ‌చ్చిన తార బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ? ఈ గేమ్ షోలోకి వెళ్లాక సిద్ధు లైఫ్ ఎలా మారింది ? ఫైన‌ల్‌గా ఏం జ‌రిగింది అన్న‌దే మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ :
ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ.. జీవితంలో ఏం సాధించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న యువ‌కుడు లైఫ్‌లో జ‌రిగిన ట్విస్టులే ఈ సినిమా స్టోరీ. ముందు సినిమాలో 12 ఏళ్ల క్రితం జ‌రిగిన హ‌త్య చూపిస్తారు. ఆ త‌ర్వాత ఇప్పుడు స్టోరీలోకి ఎంట్రీ ఉంటుంది. ఫ‌స్టాఫ్‌లో హీరో ఫెయిల్యూర్స్‌తో సాగే గేమ్‌లోకి ప్ర‌వేశించ‌డం ఆ త‌ర్వాత టాస్కులు ఇంట‌ర్వెల్ టైంకు నేహాతో ప్రేమ‌లో ప‌డ‌డం .. ఓ మ‌నిషిని చంపే టాస్క్ చేయ‌ను అని హీరో చెప్ప‌డంతో అత‌డిసై అటాక్‌తో సెకండాఫ్‌లో ఏం జ‌రుగుతుందా ? అన్న స‌స్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక సెకండాఫ్‌లో హీరో మీద ఎటాక్‌, హీరో ప్లాష్ బ్యాక్‌, అమ్మ సెంటిమెంట్‌తో సినిమాను బాగా న‌డిపించారు. చివ‌ర్లో రెండు ట్విస్టులు రివీల్ చేసి ఉత్కంఠ క్రియేట్ చేశారు.

క్లైమాక్స్‌లో వ‌చ్చే మ‌ధుబాల యాక్టింగ్ కాస్త సిల్లీ అనిపిస్తుంది. హీరో గ‌తం గురించి ఇచ్చిన ఎలివేష‌న్‌కు,ర సెకండాఫ్ ప్లాష్ బ్యాక్‌కు అంత లింక్ ఉండ‌దు. గేమ్‌లో ఇచ్చే టాస్కులు ఎమోష‌న్ల‌తో ఆడుకునేలా క‌నెక్ట్ చేయ‌డం బాగుంది. హీరో – హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. యాక్ష‌న్‌తో పాటు రొమాన్స్‌కు కూడా సినిమాలో స్పేస్ బాగుంది. హీరో గీతానంద్ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటాడు. యాక్షన్, ఎమోషన్ కూడా బాగా పండించాడు. హీరోయిన్ నేహా సోలంకి గ్లామర్ లుక్ తో యూత్ ను అట్రాక్ట్ చేసింది. సిగరెట్ మందు తాగుతూ మాసివ్ మెస్మరైజ్ చేసింది.

చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ కీలక పాత్ర పోషించారు. సినిమా ఓపెనింగే ఆయన క్యారెక్టర్‌తో స్టార్ట్ అవుతుంది. సీరియస్ ఇంటెన్స్ పాత్రను పోషించారాయన. హీరో తల్లి పాత్రలో మధుబాల ఇంపార్టెంట్ రోల్లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆదిత్య మీనన్ సైకాలజిస్ట్ గా కనిపించారు. ఆయన క్యారెక్టర్ సినిమాకు కీలకం. ఆయన పోషించిన తీరు ఆయన హావభావాలు ఆయన లుక్ ప్రెజెన్స్ సూపర్బ్. కిరీటి, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న వాసంతి మోడ్ర‌న్ అమ్మాయిగా అద‌ర‌గొట్టింది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నిక‌ల్ విష‌యాల్లో సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. యాక్షన్ సన్నివేశాల్లో, టాస్క్‌లు న‌డిచేట‌ప్పుడు సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్‌. అభి అద‌ర‌గొట్టేశాడు. ఇక అర‌వింద్ విశ్వనాథ‌న్‌ కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటాయి. కొత్త కొత్త షాట్స్ చాలా ట్రై చేశారు. విజువల్స్ లో చాలా క్లారిటీ, క్వాలిటీ ఉంది. ఎడిటింగ్ క్రిస్పీగానే క‌ట్ చేశారు. యాక్ష‌న్ సీన్లు బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ కూడా న్యాచురల్ గా కనిపించేలా సెట్ చేశారు అన్ని. ఇక దర్శకుడు దయానంద్ కి ఇది మొదటి సినిమా అయినా మెచ్యూర్డ్ డైరెక్ట‌ర్‌గా సీన్లుతీశాడు. కథ బాగున్నా కథనంపై ఇంకొంచెం దృష్టి పెడితే బాగుండు అనిపిస్తుంది. దర్శకుడిగా మాత్రం దయానంద్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాత కూడా కొత్తవాడైనా బాగానే ఖర్చు పెట్టాడు. సినిమా అంతా రిచ్ క్వాలిటీగానే కనిపిస్తుంది.

ఫైన‌ల్‌గా…
కొత్త‌వాళ్ల‌తో తెర‌కెక్కిన ఈ గేమ్ ఆన్ సినిమా ప్రేక్ష‌కుల్ని కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లుతుంది. రియ‌ల్ టైం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా కొన‌సాగుతూ ఆడియెన్స్‌లో మంచి క్యూరియాసిటీ క‌లిగిస్తుంది. యాక్ష‌న్‌, రొమాన్స్ సెంటిమెంట్ అన్నీ మిక్స్ చేసి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తెర‌కెక్కించారు. గీతానంద్, నేహా సోలంకి మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా మొదటి సినిమా అయినా బాగా ప్ర‌జెంట్ చేస్తే .. నిర్మాత క‌స్తూరి ర‌వికి ఇది తొలి సినిమా అయినా రాజీప‌డ‌కుండా సినిమా నిర్మించారు.

ఫైన‌ల్ పంచ్ : ఎమెష‌న్‌తో ఆడుకునే సైక‌లాజిక‌ల్ గేమ్ థ్రిల్ల‌ర్‌

గేమ్ ఆన్ రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news