ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా తేజ సజ్జా నటించిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు సక్సెస్ఫుల్గా ఇంకా థియేటర్స్ లో కొనసాగుతూనే ఉంది . ఇప్పటికే ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్ధలు కొట్టిందో మనకు తెలిసిందే. ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో ముందుకు వెళుతుంది అంటే ఈ సినిమాలోని స్టామినా అర్థం చేసుకోవచ్చు .
రీసెంట్గా హనుమాన్ సినిమా 92 ఏళ్ల సినీ చరిత్రను తిరగరాసింది . సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు 278 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి అదుర్స్ అనిపించింది . అయితే ఇందులో ఏంటి ప్రత్యేక అనుకుంటున్నారా..? సంక్రాంతికి విడుదలైన సినిమాల లిస్టులో గత 92 ఏళ్ల సినీ చరిత్రలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ సినిమా బీట్ చేసింది .
ఇదే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. మొన్నటి వరకు ఈ రికార్డ్ అల్లు అర్జున్ పేరు మీద ఉండేది . 2020 సంక్రాంతికి వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమా బాక్సాఫీస్ వద్ద 260 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది . ఇప్పుడు ఆ సినిమా రికార్డుని హనుమాన్ బ్రేక్ చేసి కనీ విని ఎరుగని సంచలన రికార్డును నెలకొల్పింది..!!
#HanuMania has etched its legacy in TFI❤️🔥❤️🔥❤️🔥
— Primeshow Entertainment (@Primeshowtweets) February 2, 2024
With Humongous Love from Audiences across the globe, #HanuMan creates HISTORY and becomes the ALL-TIME SANKRANTHI BLOCKBUSTER IN 92 YEARS OF TELUGU CINEMA🔥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123#HanuManEverywhere… pic.twitter.com/bw4gIFNaEv