Moviesఅప్పుడు పూజా హెగ్డే.. ఆ తరువాత రష్మిక మందన్నా..ఇప్పుడు శ్రీలీల.. ఫ్లాప్స్...

అప్పుడు పూజా హెగ్డే.. ఆ తరువాత రష్మిక మందన్నా..ఇప్పుడు శ్రీలీల.. ఫ్లాప్స్ పడిపడగానే ముగ్గురు చేసిన పని ఇదే..!!

శ్రీ లీల .. ప్రెసెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఎలా వైరల్ గా మారిపోయిందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్గా నటించిన గుంటూరు కారం సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ కి ఎలాంటి కామెంట్లు వచ్చాయో కూడా మనం చూసాం. ఇదే క్రమంలో శ్రీలీలకు సంబంధించిన మరో వార్త కూడా వైరల్ అవుతుంది.

గతంలో హీరోయిన్ పూజ హెగ్డే.. హీరోయిన్ రష్మిక మందన్నా.. ఏదైతే ప్లాన్ చేశారో.. ఇప్పుడు అదే విధంగా శ్రీలీల కూడా అలానే ముందుకు వెళుతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. పూజా హెగ్డే – రష్మిక మందన్నా.. తెలుగులో ఆఫర్లు పట్టి..హిట్స్ కొట్టి..మంచి పేరు సంపాదించుకుని.. ఇక్కడ ఫ్లాప్స్ పడ్డాక.. ఆ తర్వాత తమిళ్ ఆ తర్వాత హిందీ భాషల్లో అవకాశాలు అందించుకున్నారు .

ఇప్పుడు శ్రీ లీల అదే పని చేస్తుంది. తెలుగులో ఇన్నాళ్లు దున్నేసిన ఈమె ఇప్పుడు కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందట . అంతేకాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా వివరించడం గమనార్హం. రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల మీడియాతో మాట్లాడారు . ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు – తమిళ్ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి అని .. వాటి వివరాలను మేకర్స్ తో మాట్లాడి అఫీషియల్ గా చెప్తాను అని చెప్పుకు వచ్చింది . దీంతో రష్మిక – పూజ హెగ్డే చేసిన పనే ఇప్పుడు శ్రీ లీలా కూడా చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news