Moviesవరుణ్ సందేశ్ ని హీరోగా ఎదగనీకుండా తొక్కేసింది ఆ స్టార్ హీరో...

వరుణ్ సందేశ్ ని హీరోగా ఎదగనీకుండా తొక్కేసింది ఆ స్టార్ హీరో కొడుకేనా..? అలాంటి గబ్బు పనులు చేశాడా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయలోకం .. రంగుల ప్రపంచం. ఎప్పుడూ ఏమైనా జరగొచ్చు. ఇది జరుగుతుంది అని చెప్పలేం . స్టార్ హీరో అవ్వాలి అని ప్రతి ఒక హీరోకి ఉంటుంది . అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరో స్టార్ హీరోగా మారలేరు. కొన్నిసార్లు టాలెంట్ ఉన్నా కానీ మనల్ని తొక్కేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి మాయ లకు బలైపోయాడు వరుణ్ సందేశ్ .

కొత్త బంగారు లోకంతో స్టార్ హీరోగా మారిన వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మ్ చేసిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేసింది . ఆ తర్వాత కొత్త బంగారులోకంతో అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అయ్యాయి . అంతేకాదు వరుణ్ సందేశ్ హీరోగా ఎదగనివ్వకుండా మరొక హీరో కొడుకు తొక్కేశాడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది .

వరుణ్ సందేశ్ చేతికి మంచి మంచి కథలు వచ్చాయట . కానీ ఆ కథలు మొత్తం రాత్రికి రాత్రే ఓ స్టార్ హీరో కొడుకు చేతిలోకి వెళ్లిపోవడం గమనార్హం . ఇపూడు ఆయన ఓ పెద్ద పాన్ ఇండియా హీరో గా మారిపోయాడు. ఇలా పరోక్షంగా వరుణ్ సందేశ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణమయ్యాడు ఆ స్టార్ హీరో కొడుకు అంటూ జనాలు అప్పట్లో మాట్లాడుకునేవారు. ప్రజెంట్ వరుణ్ సందేశ్ వచ్చిన సినిమాలను చేస్తూ హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news