Moviesబిగ్ బ్రేకింగ్: తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ హీరో - హీరోయిన్ ..అఫీషియల్...

బిగ్ బ్రేకింగ్: తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ హీరో – హీరోయిన్ ..అఫీషియల్ ప్రకటన వచ్చేసిందోచ్..!

ప్రెగ్నెన్సీ ఎన్ని నెలలు దాచిన దాగదు అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు . బహుశా హీరోయిన్ దీపికా పదుకొనే విషయంలో అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఆమె ప్రెగ్నెంట్ అంటూ తెగ ప్రచారాలు జరిగాయి. బేబీ బంప్ కనిపించిన సరే అదంతా ఏం లేదు అంటూ కొట్టి పడేసింది దీపికా పదుకునె. ఫైనల్లీ ఏమనుకున్నిందో ఏమో తెలియదు కానీ అఫీషియల్ గా తాము తల్లిదండ్రులను కాబోతున్నామంటూ ప్రకటించింది ఈ జంట .

సెప్టెంబర్ 2024 లో తమ ఫస్ట్ బేబీ రాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్ళై చాలా కాలమే అవుతుంది . అప్పటినుంచి వీళ్ళ నోట గుడ్ న్యూస్ వినాలి అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేశారు .

ఫైనల్లీ ఈ జంట గుడ్ న్యూస్ వినిపించింది . దీంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు దీపికా పదుకునె రన్వీర్ సింగ్ లకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ జంట తల్లి దండ్రులు కాబోతున్నారు. అయితే ఇప్పుడు దీపిక కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పరిస్ధితి ప్రశ్నార్ధకంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news