Moviesచరణ్ కూతురు "క్లీం కార" ముద్దు పేరు ఏంటో తెలుసా..? పెట్టింది...

చరణ్ కూతురు “క్లీం కార” ముద్దు పేరు ఏంటో తెలుసా..? పెట్టింది ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కు ఒక కూతురు పుట్టిన విషయం అందరికి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్లకు వీళ్ళకు పాప జన్మించింది. ఈ 11 ఏళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో ఎంతో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు . కానీ ఉపాసన – రాంచరణ్ ఏనాడు బాధపడలేదు. ఫైనల్లీ రాంచరణ్ – ఉపాసన ..క్లింకారకు తల్లిదండ్రులు అయ్యారు. మెగా ఫామిలీ లోకి వచ్చాక మెగా ఫ్యామిలీ లో కొత్త కళ వచ్చింది అంటూ మెగాస్టార్ చెప్పుకు వచ్చారు .

వరుణ్ తేజ్ కి పెళ్లి అయింది అన్నా.. పుష్ప సినిమాకుగాను ఉత్తమ జాతీయ అవార్డు బన్నీ అందుకున్నాడు అన్నా.. పద్మ విభూషణ్ అవార్డ్ చిరంజీవికి వచ్చింది అన్నా.. కారణం క్లిం కార అనే అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . అఫ్కోర్స్ క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ కు బాగా కలిసి వచ్చింది . ప్రెసెంట్ క్లింకార పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానికి కారనం లేకపోనూ లేదు.

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..ఉపాసన క్లిం కార ను ..కారా అని పిలుస్తాము అంటూ పరోక్షకంగా చెప్పేసింది. దీంతో ఇదే ఆమె ముద్దు పేరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . క్లిం కార ముద్దు పేరు చాలా క్యూట్ గా ఉంది అని అందరిలాగా.. హనీ, పప్పీ అంటూ లేకుండా అసలు పేరు నే ముద్దు పేరుగా పిలుచుకోవడం ఇంకా ఇంకా బాగుంది అని చెప్పుకొస్తున్నారు మెగా ఫ్యాన్స్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news