Moviesఫైనల్లీ .. తన కోరికను ఆ స్టార్ హీరోతో తీర్చుకోబోతున్న పూరి...

ఫైనల్లీ .. తన కోరికను ఆ స్టార్ హీరోతో తీర్చుకోబోతున్న పూరి జగన్నాథ్.. ఏం స్కేచ్ వేశాడు రా బాబు..!!

పూరి జగన్నాథ్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా రాజ్యమేలేసాడు . డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో అంత మంచి స్థానాన్ని అందుకోలేకపోతున్నాడు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

ఆయన తెరకెక్కించిన లైగర్ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి తుస్సు అని అనిపించింది. పూరి జగన్నాధ్ ని నమ్మి ఇప్పుడు అవకాశాలు ఇవ్వడానికి స్టార్ హీరోలు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోని ఆయన రాం పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో జనగణమన అనే ప్రాజెక్టును తెరకెక్కించాలి అంటూ ఆశ పడుతున్నారు .

గతంలో మహేష్ బాబు ఈ సినిమాకు కమిట్ అయ్యి రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ అదే విధంగా కమిట్ అయ్యి రిజెక్ట్ చేసాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో తెరకెక్కించాలి అనుకుంటున్నాడట పూరి జగన్నాథ్ . ఆయనకు కథ కూడా వివరించారట . ఆయన కూడా ఓకే చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైనల్లీ ఆ హీరోతో తన కోరికను నెరవేర్చుకోబోతున్నాడు పూరి జగన్నాథ్ అన్న వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news