News"ది గ్రేట్***..నా బొచ్చు కూడా పీకలేరు".. ప్రముఖ వెబ్ సైట్ పై...

“ది గ్రేట్***..నా బొచ్చు కూడా పీకలేరు”.. ప్రముఖ వెబ్ సైట్ పై రెచ్చిపోయిన డైరెక్టర్ హారీష్ శంకర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ తాజాగా నటించిన సినిమా ఈగల్ . యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.. సూపర్ డూపర్ హిట్ అయింది . కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మి పడేస్తుంది. అంతేకాదు చాలా కాలం తర్వాత రవితేజ హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ క్రమంలోని మూవీ టీం గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది .

ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ మీట్లో రవితేజ నెక్స్ట్ నటించబోతున్న డైరెక్టర్ హరిష్ శంకర్ కూడా పాల్గొన్నారు. అయితే ఎప్పుడు చాలా సరదాగా జోవియల్ గా ప్రతి విషయాన్ని లైట్ గా తీసుకునే హరీష్ శంకర్ ఫస్ట్ టైం స్టేజిపై రేంజ్ లో కోపంతో ఊగిపోయారు. ఆయనపై తప్పుడు వార్తలు రాస్తున్న ఒక వెబ్సైట్ ను చీల్చి చెండాడేసాడు. స్టేజి పైకి వచ్చిన హరీష్ శంకర్ సరదాగానే మాట్లాడుతూ మధ్యలో సీరియస్ అయిపోయారు .

ఆయన మాట్లాడుతూ..” ఎవరో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ .. ఒక సినిమా హిట్ కొట్టి ఆ తర్వాత నిద్రపోతున్నాడు .. అంతేకాదు రాత్రులు మందు తాగుతూ జల్సాలు చేస్తున్నాడు .. కెరియర్ పై ధ్యాస లేకుండా ఉంటున్నాడు అంటూ నోటికొచ్చినట్లు ఏవేవో రాస్తున్నారు ..ఎవడ్రా ఆ డైరెక్టర్.. నేనే ..నాకు తెలియదా నా గురించే మీరు రాసింది ..రాయ్ దమ్మున్నోడివైతే ..పేరు పెట్టి ఫోటో పెట్టి నా పేరు రాయ్..అంతేకానీ ఇలా ఊరు పేరు లేకుండా వార్తలు రాసేసి పక్క వాళ్ళని చీప్ చేస్తావా..?”

” ఏరా నువ్వు నాకు పెగ్గు పోసావా..? రాత్రి నువ్వు నాతో వచ్చి ఉన్నావా ..? ఎవడ్రా నీకు చెప్పింది.. నీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు పెట్టి ఫోటో పెట్టి రాయ్.. అంతేకానీ ఇలా చెత్త వార్తలు రాయొద్దు ..రవితేజ నటించిన ఈగల్ సినిమాకి ఒకటి పాయింట్ ఐదు రేటింగ్ ఇస్తావా ..? యాత్ర సినిమాకి మూడు రేటింగ్ ఇస్తావా..? నీ ఆటలు ఎవరికి తెలియదు రా ..?” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారు . దీంతో హరీష్ శంకర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news