Moviesసిద్ధార్థ్ రాయ్ మూవీ రివ్యూ: అర్జున్ రెడ్డి కి అమ్మ మొగుడే...

సిద్ధార్థ్ రాయ్ మూవీ రివ్యూ: అర్జున్ రెడ్డి కి అమ్మ మొగుడే ఇది.. సినిమా మొత్తానికి అదే హైలేట్..!

సిద్ధార్ధ్ రాయ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన దీపక్ సరోజ్ హీరోగా నటించిన చిత్రం . ఈ సినిమాపై అభిమానులకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానుల్ని అలరిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేశారు అభిమానులు . రిలీజ్ అయిన టీజర్ – ట్రైలర్ పోస్టర్స్ అభిమానులను ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసేలా చేసింది. ఈ సినిమా కొద్ది గంటల క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది .

సిద్ధార్ధ్.. పై తమదైన స్టైల్ లో రివ్యూలు ఇస్తున్నారు జనాలు. అతడు చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఈ దీపక్ నేనా..సిద్ధార్థ రాయ్ లో కనిపించిన ఈ దీపక్ .. అంటూ ఫైర్ అయిపోతున్నారు . ఈ సినిమాల్లో దీపక్ పెర్ఫార్మెన్స్ టు ఫైరీగా ఉంది అని ట్రెండ్ చేస్తున్నారు . అర్జున్ రెడ్డి – యానిమల్ తరహాలో ఈ సినిమా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లాజిక్స్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది ఈ సినిమా.. మరి ముఖ్యంగా యువత ఈ సినిమాకి ఫిదా అయిపోతుంది. చిన్నప్పటినుంచి బుక్స్ చదువుతూ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా లాజిక్స్ తో ఉండే సిద్ధార్ధ్.. ఆ తర్వాత తన లైఫ్ లో ఎమోషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి..

ఆ తర్వాత ఎమోషన్స్ ఆయన లైఫ్ని ఎలా మార్చేశాయి అన్నదే అసలు స్టోరీ . ఈ సినిమాలో సిద్ధార్ధ్ రాయ్.. క్యారెక్టర్జేషన్ సూపర్.. చాలా కొత్తగా అనిపిస్తుంది . జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకొని ప్రతిదీ లాజిక్స్ తోనే ముడిపెడుతూ ఉంటాడు . తెరపై దీపక్ పెర్ఫార్మెన్స్ అద్దిరిపోతుంది . రొమాన్స్ కూడా టు బోల్డ్ గానే ఉంటుంది . అర్జున్ రెడ్డిని మించిపోయే స్థాయిలోనే సినిమాని చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. అంతేకాదు నేటి యువత ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేయగలదు అంటున్నారు సినిమా చూసిన జనాలు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news