Moviesచెల్లి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి.. రియల్లీ గ్రేట్...

చెల్లి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి.. రియల్లీ గ్రేట్ సిస్టర్..!

సాయి పల్లవి .. పేరుకి మలయాళీ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకొని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మలర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అమ్మడు నటనకి ఫిదా అయిపోయారు జనాలు . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . కాగా హీరోయిన్ సాయి పల్లవి చెల్లి పూజ నిశ్చితార్థం తాజాగానే జరిగింది .

ఈ నిశతార్థంలో సాయి పల్లవి చాలా అట్రాక్టివ్ గా కనిపించింది . సింపుల్ శారీ తో ట్రెడిషనల్ లుక్ తో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసింది . ఆమె వేసిన తీన్ మార్ డాన్స్ తాలూకా వీడియో ఇప్పటికి నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది . రీసెంట్గా సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి తన చెల్లి కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అభిమానులకు షాకింగ్ అనిపిస్తుంది .

ఇన్నాళ్లు ఆమె కష్టపడి సంపాదించినదంతా కూడా తన చెల్లి పూజా కన్నన్ కి ఇచ్చేయాలి అంటూ డిసైడ్ అయిందట . తన దగ్గర దాచుకున్న డబ్బులని తన గోల్డ్ ని అన్నీ కూడా తన చెల్లి పూజకి గిఫ్ట్ గా ఇస్తుందట . తనకోసం ఒక్క రూపాయి కూడా సేవ్ చేసుకోవట్లేదు . ఇది చాలా రేర్ గా మనం చూస్తుంటాం. నువ్వు నిజంగా గ్రేట్ సిస్టర్ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news